Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breast Milk: ఆ రాష్ట్రంలో చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్న మహిళలు.. అమ్మపాలు ప్రమాదకరంగా మారాయి అంటున్న పరిశోధకులు

Breast Milk: అమ్మపాలు అమృతంతో సమానం.. అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు మించిన ఆహారం మరొకటి లేదు.. ఇది అందరికీ తెలిసిందే.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచంలో ఇప్పటి వరకూ కల్తీకానిది ఏదైనా ఉంటె అది అమ్మపాలు..

Breast Milk: ఆ రాష్ట్రంలో చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్న మహిళలు.. అమ్మపాలు ప్రమాదకరంగా మారాయి అంటున్న పరిశోధకులు
Bihar Arsenic Mother Milk
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2022 | 1:01 PM

Breast Milk: అమ్మపాలు అమృతంతో సమానం.. అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు మించిన ఆహారం మరొకటి లేదు.. ఇది అందరికీ తెలిసిందే.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచంలో ఇప్పటి వరకూ కల్తీకానిది ఏదైనా ఉంటె అది అమ్మపాలు మాత్రమే అని అనేవారు.. అయితే ఇప్పడు ఆ మాటకు బీహార్ రాష్ట్రా(Bihar State)నికి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిపాలలో చిన్నారికి హానికలిగించే పాషాణమే(arsenic) అధికంగా ఉందని ముఖ్యంగా గంగా నది(Ganga River) తీరంలో ఉన్న రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని తల్లుల పాలల్లో ఈ  ఆర్సెనిక్ బయపడి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని వైశాలి, పాట్నా, బక్సర్, భోజ్​పుర్, సరన్, వైశాలి, బాగల్​పుర్ జిల్లాల్లోని పాలు ఇచ్చే తల్లుల్లో ఈ ఆర్సెనిక్ అధికంగా కనిపించింది. క ముఖ్యంగా బక్సర్ జిల్లాలో ఈ ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉంది. ఈ జిల్లాలోని తల్లి లీటరు పాలల్లో సుమారు 495.2 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తల్లిపాలు అప్పుడే పుట్టిన శిశువు .. ఆరు నెలలు వచ్చే వరకూ తాగించాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఇలా అరెన్సిక్ అధికంగా ఉన్న తల్లిపాలు తాగిన శిశువుకి ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే శరీరంలో అరెన్సిక్ స్థాయి పెరిగితే.. క్యాన్సర్ వ్యాధి బారిన పడే ఆవకాశం అధికం. ఇక కాలేయం, కిడ్నీ, గుండె, చర్మ వ్యాధి వంటి అనేక ఇతర సమస్యలకు కూగా గురవుతారు.

ఎంత శాతం అరెన్సిక్ ఉండాలంటే:  లీటరు తల్లిపాలలో 0.2 నుంచి 0.6 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉంటే శిశువు తాగేందుకు ఆమోదయోగ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే. బక్సర్ జిల్లాసహా ఆరు జిల్లాలో  భారీగా ఆర్సెనిక్ కనిపించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్సెనిక్ అంటే ఏమిటంటే:   ఆర్సెనిక్ .. సల్ఫర్​ లేదా ఇతర లోహాల కలియికతో ఏర్పడే ఉపధాతువు. మైనింగ్, గాజు తయారీ, సెమీ కండక్టర్ అనేక రసాయనాల తయారీలో అరెన్సిక్ ను ఉపయోగిస్తారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటి వరకూ ఈ ఆర్సెనిక్ బారిన పడినవారికి చికిత్స లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

చికిత్స లేదు.. నివారణే ముఖ్యం: అయితే ఈ ఆర్సెనిక్ బారిన పడకుండా ఉండడం కోసం వైద్యులు, పోషకాహార నిపుణులు కొన్ని నివారణ సూచనలు తెలిపారు. ముఖ్యంగా అపరిశుభ్రమైన నీటిని తాగకూడదని తెలిపారు. నీటిని ఆర్ఓ పద్ధతిలో శుభ్రం చేసుకోవాలని.. లేదంటే.. నీటి శుభ్రంగా వేడి చేసుకుని.. ఆ నీటిని శుభ్రమైన క్లాత్ తో వడకట్టి తాగాలని సూచిస్తున్నారు.

ఈ జిల్లాల్లో ఆర్సెనిక్ ఎలా పాళ్లు ఎలా పెరిగాయంటే… గంగా నది జలాల్లో ఆర్సెనిక్ పాళ్లు పెరిగి సమీప జిల్లాల్లోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వాదన నెలకొంది.  రసాయన ఎరువులు వాడటం, బొగ్గు మండించడం, బొగ్గు లీచింగ్ ప్రక్రియల్లో విడుదలయ్యే ఆర్సెనిక్ జలాల్లో కలుస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక, మున్సిపల్ వ్యర్థాలు గంగా నదిలోని నీటిలో కలవడం మూలంగా ఆర్సెనిక్ పరిమాణం పెరిగిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో సైతం ఆర్సెనిక్ ఆనవాళ్లు: గంగా పరివాహక రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ పాళ్లు పెరిగాయని పరిశోధకుల వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. భావితరాలకు చాలా నష్టపోతామని హెచ్చరిస్తున్నారు.

Also Read:

మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..