Kacha Badam Singer: సోషల్ మీడియా సెన్సెషనల్ కచ్చా బాదమ్ సింగర్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో చికిత్స
Kacha Badam Singer Bhuban Badyakar: నెట్టింట ఎక్కడ చూసినా.. కచ్చా బాదమ్ సాంగ్ తెగ హల్‌చల్ చేస్తోంది. చాలామంది నెటిజన్లు కచ్చా బాదమ్ పాటకు స్టెప్పులేస్తూ.. కేరింతలు కొడుతున్నారు.
Kacha Badam Singer Bhuban Badyakar: నెట్టింట ఎక్కడ చూసినా.. కచ్చా బాదమ్ సాంగ్ తెగ హల్‌చల్ చేస్తోంది. చాలామంది నెటిజన్లు కచ్చా బాదమ్ పాటకు స్టెప్పులేస్తూ.. కేరింతలు కొడుతున్నారు. అయితే.. ఈ కచ్చా బాదమ్ పాటతో రాత్రికిరాత్రే.. సోషల్ మీడియాలో సెన్సెషనల్ అయిన పల్లీలు అమ్మే చిరు వ్యాపారి భుబన్ బద్యాకర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో సోమవారం ఈ రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కచ్చా బాదమ్ పాట నెట్టింట వైరల్ అయిన తర్వాత భుబన్ బద్యాకర్.. పల్లీల వ్యాపారం మానేస్తున్నానని ప్రకటించారు. అయితే.. ఈ క్రమంలో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ బెంగాల్ (West Bengal) లోని సూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం ఏం లేదని వైద్యులు తెలిపారు.
కచా బాదం సాంగ్ ఇటీవల వైరల్ అయింది. దీంతో భుబన్ బద్యాకర్ స్టార్‌గా మారిపోయాడు. చాలా మంది దీనిని డ్యాన్స్ రీల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీధిలో వేరుశెనగలు అమ్ముతున్నప్పుడు భుబన్ ఈ ప్రత్యేకమైన పాటను పాడడాన్ని ఎవరో రికార్డ్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో ఆయన ఫేమస్ వ్యక్తిగా మారాడు. అయితే.. ఈ పాటను ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు రీమెక్‌లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా భుబన్‌కి మ్యూజిక్ కంపెనీల నుంచి, టీవీ షోల నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.
Also Read: