AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బుఖారెస్ట్ క్యాంప్‌లో భారతీయ విద్యార్థిని బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

Romania Bucharest: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై బాంబులతో భీకరంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Watch Video: బుఖారెస్ట్ క్యాంప్‌లో భారతీయ విద్యార్థిని బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Indian Student Birthday Cel
Shaik Madar Saheb
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 02, 2022 | 11:31 AM

Share

Romania Bucharest: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై బాంబులతో భీకరంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు వేరే దేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో రోమానియా సహా ఇతర దేశాల్లో బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడి భారత ప్రజలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రోమానియా నుంచి భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. దీంతోపాటు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ భారత విద్యార్థులను క్షేమంగా తీసుకోచ్చేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా ఇతర దేశాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంది. అయితే.. ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను రోమానియా నుంచి తీసుకొచ్చేందుకు కేంద్ర విమానాయన మంత్రి సింధియాను అక్కడికి పంపింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం రొమేనియా ప్రధానమంత్రి నికోలే-ఇయోనెల్ సియుకాతో సోమవారం భేటీ అయ్యారు. వీసాలు లేకుండా రొమేనియా ద్వారా భారతీయ పౌరులను తరలించడానికి వీలు కల్పించినందుకు, విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చినందుకు ప్రధాని మోడీ (PM Narendra Modi) నికోలే-ఇయోనెల్ సియుకా (Mr. Nicolae-Ionel Ciucă) కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభంపై సామరస్యంగా చర్చించుకోవాలని సూచించారు.

అయితే.. ఉక్రెయిన్ బాధితుల కోసం రోమానియా బుఖారెస్ట్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో ఓ భారత విద్యార్థిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను అక్కడి నిర్వాహకులు, బాధితులు ఘనంగా నిర్వహించారు. స్వదేశానికి వచ్చేందుకు భారత విద్యార్థిని బుఖారెస్ట్ క్యాంప్‌నకు చేరుకుంది. అయితే.. ఆమెతోపాటు పలువురు విద్యార్థునులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బిక్కుబిక్కుమంటూ క్యాంప్‌లో ఉన్న విద్యార్థిని పుట్టిన రోజు అని తెలుసుకున్న అక్కడున్న వారు ఆమె బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ఇక్కడినుంచి ఇంటికి వెళ్లాలని ఏడుస్తూ ఎదురుచూస్తున్న ఆమెకు అందరూ కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. క్యాంప్‌లో ఉన్న వారంతా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి.. కేక్ కట్ చేయించి ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ ఆమెకు బర్త్‌డే విషెశ్ తెలుపుతున్నారు.

Also Read:

Russia Ukraine War Live: నివాస ప్రాంతాలపై రష్యా మిసైళ్లు.. కీవ్‌ను విడిచి వెళ్లాలని హెచ్చరికలు

PM Narendra Modi: ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధాని మోడీ ఆవేదన.. రొమేనియా పీఎంతో కీలక భేటీ..