PM Narendra Modi: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఆవేదన.. రొమేనియా పీఎంతో కీలక భేటీ..
PM Modi talks Romanian counterpart: ఉక్రేయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడి భారత ప్రజలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రొమేనియా ప్రధానమంత్రి
PM Modi talks Romanian counterpart: ఉక్రేయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడి భారత ప్రజలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రొమేనియా ప్రధానమంత్రి నికోలే-ఇయోనెల్ సియుకాతో భేటీ అయ్యారు. వీసాలు లేకుండా రొమేనియా ద్వారా భారతీయ పౌరులను తరలించడానికి వీలు కల్పించినందుకు ప్రధాని మోడీ (PM Narendra Modi) నికోలే-ఇయోనెల్ సియుకా (Mr. Nicolae-Ionel Ciucă) కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో రొమేనియా అందించిన సహాయం మరువలేనిదన్నారు. వీసాలు లేకుండా రొమేనియాలోకి ప్రవేశించడానికి భారతీయ పౌరులను అనుమతించడం, ప్రత్యేక విమాన సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవడంపై నికోలే-ఇయోనెల్ సియుకాను ప్రధాని మోడీ అభినందించారు. ఈ భేటీలో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింసపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్యం కోసం కాకుండా.. శాంతియుత చర్చలు ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ముఖ్యమని పునరుద్ఘాటించారు. భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు రోమానియాకు ప్రత్యేక ప్రతినిధిగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాను నియమించడంపై కూడా ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా సియుకాతో పలు అంశాలపై ప్రధాని వివరించారు.
కాగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. రష్యా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పాలనను స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఎదురు దాడులు చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై.. పాశ్చాత్య దేశాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే.. అమెరికా, బ్రిటన్ సహా.. పలు దేశాలు రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి.
Also Read: