Viral Photo: రెండు జడల అమ్మాయి.. తెలుగులోనే క్రేజీ హీరోయిన్.. యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువే..

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్.. చిన్నప్పుడు ఎలా ఉన్నారు.. వారు ఎక్కడ చదువుకున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

Viral Photo: రెండు జడల అమ్మాయి.. తెలుగులోనే క్రేజీ హీరోయిన్.. యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 01, 2022 | 11:45 AM

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్.. చిన్నప్పుడు ఎలా ఉన్నారు.. వారు ఎక్కడ చదువుకున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ముందుంటారు. ఇటీవల గత కొద్ది రోజులుగా నెట్టింట్లో త్రోబ్యాక్, రేర్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చిన్ననాటి ఫోటోసు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ఆ చిన్నారి ఎవరో తెలుసుకుందామా.

పైన ఫోటోలో రెండుజళ్లతో అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? ఈ స్టార్ హీరోయిన్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ చిన్నారి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రజినీ కాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. మీకోసం మరో చిన్న క్లూ.. ఈ అమ్మడు.. తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ కొనసాగుతుంది.

ఆ రెండు జడల చిన్నారి మరెవరో కాదండోయ్.. హీరోయిన్ శ్రియా శరణ్. చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తూ రాణిస్తుంది.

Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..

Rashmika Mandanna: ఆ సినిమాలో కష్డపడితే.. ఈ మూవీ పిక్నిక్‏లా ఎంజాయ్ చేశా.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్..

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.