Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..

మోస్ట్ అవైయిటెడ్ సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 01, 2022 | 6:49 AM

మోస్ట్ అవైయిటెడ్ సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1970లో జరిగిన అందమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్.

ఈ క్రమంలో మార్చి 2 నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ తన చిత్ర యూనిట్ తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రభాస్ సందడి చేయనున్నాడు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు.  సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది.

Also Read: Bheemla Nayak: పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు మరి.. భీమ్లా నాయక్ వసూళ్లు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!

Sebastian PC524 Trailer: యంగ్ హీరో కోసం విజయ్ దేవరకొండ.. ఆసక్తికరంగా సెబాస్టియన్ పీసీ 524 ట్రైలర్ ..