AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!

Kajal Viral Video: ‘లక్ష్మీ కళ్యాణం’లో లక్షణంగా కనిపించి.. ‘చందమామ’లో పాలవెన్నెల లాంటి తన అందమైర రూపంతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసి..

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!
Kajal Agarwal
Shiva Prajapati
|

Updated on: Feb 28, 2022 | 8:04 PM

Share

Kajal Viral Video: ‘లక్ష్మీ కళ్యాణం’లో లక్షణంగా కనిపించి.. ‘చందమామ’లో పాలవెన్నెల లాంటి తన అందమైర రూపంతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసి.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచింది సోయగాల సుందరి కాజల్ అగర్వాల్. దాదాపు 15 ఏళ్లపాటు తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాల్లో కథానాయకిగా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. వివాదాలకు, రూమర్లకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్ అగర్వాల్.. 2020 అక్టోబర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవలే తాను ప్రెగ్నెంట్ అని కూడా ప్రకటించిన కాజల్.. తాజాగా మరో షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. గర్భవతి అయిన కాజల్‌కు ఇటీవలే సీమంతం ఘనంగా నజరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులను పంచుకున్న కాజల్.. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఎలాంటి ఆరోగ్యకరమైన వ్యాయామం చేయాలో వివరిస్తూ తాజాగా మరో వీడియోను పంచుకుంది.

‘‘నేను ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటాను. జీవితంలో ఇప్పటి వరకు చాలా పని చేశాను. గర్భం అనేది భిన్నమైన బాల్ గేమ్ వంటింది. గర్భవతి అయిన మహిళలు అందరూ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఏరోబిక్, స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.’’ అంటూ క్యాప్షన్ పెట్టింది అమ్మడు.‘‘పిలేట్స్, బారే వర్కౌట్స్ నా శరీరం మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడింది. ప్రెగ్నెన్సీ సమయంలో సంపూర్ణ ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడానికి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ దోహదపడుతుంది.’’ అని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ.

సాధారణంగానే మహిళలు గర్భవతి అయినప్పుడు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, కొందరు మూర్ఖులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా మహిళలను బాడీ షేమింగ్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై కాజల్ గట్టి కౌంటరే ఇచ్చింది. ‘‘గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో పాటు.. అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ముఖంపై మొటిమలు వస్తాయి. సాధారణ రోజుల్లో కంటే ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో చాలా అలసిపోతుంటారు. అయితే, దీనిని అసాధారణంగా భావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ట్రోల్స్‌ని పట్టించుకుని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన జీవితంలో అత్యంత అందమైన, అద్భుతమై, విలువైన దశ ఇది. ఈ సమయంలో అసౌకర్యంగా ఫీలవడం, ఒత్తిడికి గురికావడం లాంటివి అవసరం లేదు.’’ అని పేర్కొంది. కాగా, కాజల్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాజల్ పోస్ట్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాండ్స్ వస్తోంది. శుభాకాంక్షలు చెబుతూనే.. జాగ్రత్తలు సూచిస్తున్నారు.

Also read:

Russia Ukraine War: యూరోపియన్ దేశాలకు రష్యా షాక్.. బ్రిటన్ సహా 36 దేశాలకు విమానయానం నిషేధం!

ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్‌ను ఘనంగా సత్కరించిన రోటరీ క్లబ్

Hair Dyes: జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..