ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్‌ను ఘనంగా సత్కరించిన రోటరీ క్లబ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన 2 సంవత్సరాల పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు సలహాదారుగా జయప్రకాశ్‌సాయి సేవలందించనున్నారు.
Rotary Club of Hyderabad: ఇటీవల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్(Swachh Andhra Pradesh Corporation) సలహాదారునిగా డా. జే.జయప్రకాశ్‌సాయి(Dr.Jayaprakash Sai)ని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన 2 సంవత్సరాల పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు సలహాదారుగా జయప్రకాశ్‌సాయి సేవలందించనున్నారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్(Andhra Pradesh Mission)లో భాగంగా రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రకు సలహాదారుగా డాక్టర్ జయప్రకాశ్‌సాయిని నియమించడానికి అనుమతినిచ్చింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వచ్ఛ కార్పొరేషన్ సలహాదారులుగా నియమితులైన ప్రముఖ డయాబెటిక్ డాక్టర్, రోటరియన్ జయప్రకాష్ సాయిని హైద్రాబాద్ సెంట్రల్ రోటరీ క్లబ్ ఘనంగా సత్కరించింది. రోటరీ క్లబ్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే రోటరీ క్లబ్ దేశ వ్యాప్తంగా ఇప్పటికే విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పనలో పనిచేస్తుందని రోటరీ క్లబ్ సభ్యలు తెలిపారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్, డయాబెటిక్ లాంటి సమస్యలపై రోటరీ క్లబ్ డాక్టర్లు స్క్రీనింగ్ చేయటంతో పాటు తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం విశేష సేవలందిస్తున్న డాక్టర్ జయప్రకాష్ సాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ సలహాదారులుగా నియమితులు కావడం గర్వకారణంగా ఉందని రోటరీ క్లబ్ సభ్యులు అనందం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు జగన్ సర్కార్.. తనను స్వచ్ఛ అంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌కు సలహాదారునిగా ఎంపిక చేయటం సంతోషంగా ఉందని జయప్రకాష్ సాయి తెలిపారు. రోటరీ క్లబ్ సహాయంతో ఏపీలోని పాఠశాలల్లో వాష్ ప్రోగ్రాంను సక్సెస్ చేస్తానని జయప్రకాష్ సాయి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, డాక్టర్ జయప్రకాశ్ సాయి విజయవాడలో రెండు సంవత్సరాల పాటు స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన SBM(G) మిషన్ లో వేతనం లేకుండా నీరు – పారిశుధ్యం కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. అనేక డిపార్ట్‌మెంట్‌లు, ఎన్‌జీవోలు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, మెడికల్ రంగాలల్లో జయప్రకాశ్ సాయికి అపారమైన అనుభవం ఉంది. కాగా, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారుగా నియమించడం పట్ల జయప్రకాశ్‌సాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కోసం పాటుపడుతానని ఆయన స్పష్టం చేశారు.
Read Also… Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు