Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

AP Deputy CM Narayana Swamy-YS Jagan: పవన్‌ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా వివాదంపై ఘాటుగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పవన్ కల్యాణ్‌లా సీఎం జగన్ సినిమాలో హీరో కాదన్నారు. సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్న హీరోలకే హీరో అన్నారు.

Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
Jagan
Follow us
Anil kumar poka

|

Updated on: Feb 28, 2022 | 6:10 PM

పవన్‌ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా వివాదంపై ఘాటుగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పవన్ కల్యాణ్‌లా సీఎం జగన్ సినిమాలో హీరో కాదన్నారు. సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్న హీరోలకే హీరో అన్నారు. పేదల గుండెల్లో నిజమైన హీరోగా నిలిచారన్నారు నారాయణ స్వామి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడు కాబట్టి ఆయన సినిమా విషయాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు తీసుకునే హీరోలు సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతలను ఏ రోజూ ఆదుకోలేదని విమర్శించారు. అలాగే సినిమారంగంలోని పేద కళాకారులెవరినీ ఏ హీరో ఆదుకోలేదన్నారు. చంద్రబాబు పన్నే కుట్రల్లో ఒక భాగమే పవన్ కల్యాణ్ అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు.

మరిన్ని చూడండి ఇక్కడ: