AP News: తనను కాల్చాలంటూ చాతి చూపుతూ మందుబాబు వీరంగం.. చెప్పలేని బూతులతో పోలీసులపై

పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేశాడు ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. చెప్పలేని బూతులతో పోలీసులపై రెచ్చిపోయాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణ ఒకటో పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

AP News: తనను కాల్చాలంటూ చాతి చూపుతూ మందుబాబు వీరంగం.. చెప్పలేని బూతులతో పోలీసులపై
Drunk Man Hulchul
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2022 | 6:08 PM

Crime News: పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేశాడు ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. చెప్పలేని బూతులతో పోలీసులపై రెచ్చిపోయాడు. చిత్తూరు జిల్లా(Chittoor District) శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణ ఒకటో పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని కుమారస్వామి తిప్ప వీధికి చెందిన ప్రదీప్ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో రాత్రంతా నానా హంగమా చేశాడు. అతన్ని ఆపడం పోలీసుల వల్ల కూడా కాలేదు. శ్రీకాళహస్తిలో ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. మద్యం మత్తులో రోడ్డుపై వచ్చిపోయే వాహనాలను అడ్డగిస్తూ బెంబేలెత్తించాడు ప్రదీప్ రెడ్డి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో మరింత రెచ్చిపోయాడు ప్రదీప్ రెడ్డి. దమ్ముంటే తనను కాల్చాలంటూ చాతిచూపుతూ వీరంగం సృష్టించాడు. గతంలోనూ ఇలాగే వాహనాలు అడ్డగించి దాడి చేసినట్లు యువకుడిపై కేసులు ఉన్నట్లు తెలిసింది. పోలీసులపైనే ఏకంగా ఆ యువకుడు రెచ్చిపోయిన దృశ్యాలను చూసి ఫిర్యాదుదారులు విస్తుపోయారు. ఇంతలా వీరంగం చేసిన మందుబాబుపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కాగా ఇలా పోలీసులపైనే తిరగబడుతున్న వ్యక్తి.. సామాన్యులతో ఎలా ప్రవర్తిస్తాడో అందరూ ఊహించవచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి వారిని జైల్లో వేసి.. కఠిన శిక్ష విధిస్తేనే దారిలోకి వస్తాడని అంటున్నారు.

Also Read: Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!