AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు మరి.. భీమ్లా నాయక్ వసూళ్లు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

ఇప్పుడు ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) మేనియా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో

Bheemla Nayak: పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు మరి.. భీమ్లా నాయక్ వసూళ్లు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
Pawan Kalyan Bheemla Nayak
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2022 | 1:14 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) మేనియా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా కోసం ప్రేక్షకులకు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్.. పవన్ , రానా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భీమ్లానాయక సినిమాతో సమ్మర్ చిత్రాలకు ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు పవన్. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరిస్థితులలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‏తో దూసుకుపోతుంది. ఈ సినిమా సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. విడుదలైన మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్‏లో చేరిపోయింది.

కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు ఫిబ్రవరి 25న విడుదలైంది. మ‌ల‌యాళ మూవీ ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించింది. సాగ‌ర్ కె.చంద్ర మూవీకి డైరెక్షన్ చేయగా.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేశారు. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. పవన్ సరసన నిత్యామీన‌న్‌, రానా సరసన సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికాలో భీమ్లా నాయక్ సినిమా దాదాపు రూ. 14.95 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా నైజాం ఏరియాలోనూ భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది.

Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు