Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) మోస్ట్ ఎవెయిటింగ్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న

Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..
Kalaavathi Song
Rajitha Chanti

|

Feb 28, 2022 | 6:37 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) మోస్ట్ ఎవెయిటింగ్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్.. మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు చెందిన సంగీత ప్రమోషన్‌లు విపరీతమైన ఆదరణతో ప్రారంభించబడ్డాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కళావతి లిరికల్ వీడియో అద్భుతమైన స్పందనను పొందింది. పైగా ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇది ఇప్పటికే రికార్డు సంఖ్యలో లైక్‌లతో 24 గంటల్లో అత్యధిక వీక్షణల రికార్డును బ్రేక్ చేసింది.

తాజాగా కళావతి పాట మరో ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి సింగిల్ ఇది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన ఈ పాట అన్ని మ్యూజిక్ అప్లికేషన్‌లలో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఎస్ తమన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాట పాడగా, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. సంగీత ప్రియులు ఈ పాటపై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. నెటిజన్లు మేకింగ్ విధానాన్ని మెచ్చుకుంటూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక ధరకు సరిగమ సంస్థ ఈ సినిమా సంగీత హక్కులను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. సర్కారు వారి పాట సినిమాకుకు చెందిన పనులు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..

Also Read: Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..

Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu