Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

డైరెక్టర్ తిరుమల కిషోర్ (Thirumala Kirshore) దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand ) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu)..

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2022 | 9:06 PM

డైరెక్టర్ తిరుమల కిషోర్ (Thirumala Kirshore) దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand ) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu).. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‏లోని శిల్పా కళా వేదికలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులో హీరో శర్వాంద్ వరుసగా పెళ్లి చూపులకు వెళ్తుంటాడు..కానీ అతడి కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు పిల్ల నచ్చకపోవడంతో అన్ని రిజెక్ట్ చేస్తుంటారు. దీంతో శర్వానంద్ ఇరిటేట్ అవుతుంటాడు. చివరకు ప్లా్ట్ ఫామ్ మీద కూడా పెళ్లి చూపులు పెడతారు. ఇందులో బ్రహ్మనందం కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. అలా సాగిపోతున్న శర్వానంద్ జీవితంలోకి రష్మిక రావడం. ఆమెతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి అంటూ శర్వానంద్ అనుకుంటుండగా.. రష్మిక నో చెప్తుంది. రష్మికను పెళ్లికి ఒప్పించడానికి శర్వానంద్ ట్రై చేయడం ట్రైలర్‏లో చూపించారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?

మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video