Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..

ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తుంది. తమ ఆలోచనలు

Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..
Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2022 | 8:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తుంది. తమ ఆలోచనలు.. భావాలను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను ఎంచుకుంటారు. ఇక సినీ తారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‏గా ఉంటారో తెలిసిందే. ఈ తరం స్టార్స్ నెట్టింట్లో ఫోటోషూట్స్.. రీల్స్.. లైవ్ చాట్స్ అంటూ అభిమానులతో కలిసి రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే అలనాటి తారలను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల అతిలోక సుందరి.. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేక కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా సురేఖ కొణిదెల ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రామ్ చరణ్‏తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నా సూపర్ స్టైలీష్ కొడుకుతో నా ఫస్ట్ పోస్ట్‏తో ట్విట్టర్‏లో చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సురేఖ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఖాతాలను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్ల వైరల్ అవుతుంది. అలాగే సురేఖ కొణిదెల యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు..ప్రస్తుతం మెగాస్టార్… గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఆచార్య సినిమమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్, కాజల్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు.

మరోవైపు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చరణ్.. పాన్ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!