Nithiin: సౌత్ ఇండియాలోనే ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

హీరో నితిన్ (Nithiin).. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జయం సినిమాతో

Nithiin: సౌత్ ఇండియాలోనే ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 28, 2022 | 10:49 AM

హీరో నితిన్ (Nithiin).. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నితిన్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకున్నాడు. తాజాగా నితిన్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. సౌత్ ఇండియాలోనే హిందీలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన హీరోగా నితిన్ రికార్డ్ సాధించాడు.

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ హక్కులు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. శాటిలైట్ ఛానల్స్ మరియు యూట్యూబ్ ద్వారా హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల మోజులో పడ్డారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యాడు. అందుకే నితిన్ అరుదైన ఘనతను సాధించాడు. యూట్యూబ్‌లో 2.3 బిలియన్ల వీక్షణలను పొందిన మొదటి, ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్. యూట్యూబ్‌లోని వివిధ ఛానెళ్లలో అతని హిందీ-డబ్బింగ్ చిత్రాలన్నీ 2.3 బిలియన్లకు పైగా వీక్షణలను పొందాయి. నితిన్ సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తాలను వసూలు చేయడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నితిన్ తాజాగా M.S. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ రైట్స్‌కి ఇప్పటికే నమ్మశక్యం కానీ ఆఫర్లు రావడం విశేషం.

Also Read: Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..

Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..