India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో లక్ష దిగువకు చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు..
India Covid-19 Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో సోమవారం కేసుల సంఖ్య మరింత భారీగా తగ్గింది.
India Covid-19 Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో సోమవారం కేసుల సంఖ్య మరింత భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,915 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.77 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 92,472 (0.22%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,31,045 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,023 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 16,864 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,24,550 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.58 శాతానికిపైగా ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,70,25,914 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 18,22,513 మందికి టీకాలను వేశారు.
నిన్న దేశవ్యాప్తంగా 9,01,647 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు 76.83 కోట్లు పరీక్షలు నిర్వహించారు.
COVID19 | India reports 6,915 new cases, 180 deaths and 16,864 recoveries; Active caseload stands at 92,472 pic.twitter.com/y7aTnAUM8k
— ANI (@ANI) March 1, 2022
Also Read: