AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాగైతే ఎలా..? భూస్వాములు సైతం ఉచిత విద్యుత్తు పొందుతున్నారు: ఉచితాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పేరుతో వృథా ఖర్చు.. ఆర్థికాభివృద్ధికి ఆటంకం అంటూ.. పేర్కొంది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని నొక్కి చెప్పింది. ప్రస్తుత కాలంలో భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని.. ఇదేంటంటూ ప్రశ్నించింది.

ఇలాగైతే ఎలా..? భూస్వాములు సైతం ఉచిత విద్యుత్తు పొందుతున్నారు: ఉచితాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Supreme Court On Freebies
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2026 | 12:54 PM

Share

ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పేరుతో వృథా ఖర్చు.. ఆర్థికాభివృద్ధికి ఆటంకం అంటూ.. పేర్కొంది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని నొక్కి చెప్పింది. ప్రస్తుత కాలంలో భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని.. ఇదేంటంటూ ప్రశ్నించింది. ఈ ఖర్చు మొత్తం ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మే కదా..? అని పేర్కొంది. కొందరు విద్య, ప్రాథమిక అవసరాల ఖర్చును భరించలేరు.. అలాంటి వారికి ఉచిత పథకాలు అమలు చేయడం ప్రభుత్వాల విధి.. కానీ అలా జరగడం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ ఉచితాల ద్వారా అర్హులకు ప్రయోజనం నెరవేరేలా చూడాలని పేర్కొంది. ప్రస్తుతం ఉచితం భోజనంతో మొదలుపెట్టి.. అన్నింటినీ ఫ్రీగా ఇస్తూ ప్రజల ఖాతాల్లో నిధులు ఇచ్చే స్థాయికి చేరుకున్నామంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు..

ప్రస్తుతం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నరాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తున్నాయి.. రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవు.. దీంతో అభివృద్ధి ఎలా సాధ్యం.. అని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాల ఆదాయం జీతాలు, ఉచితాలకే సరిపోతుందన్న చీఫ్ జస్టిస్ (CJI).. అభివృద్ధి ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్రంతో పాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు ఇలాంటి పథకాలు ఎందుకు ప్రకటిస్తున్నారో మేము పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు తమ భావాజాలాన్ని పునఃపరిశీలించుకోవాలని సూచించింది.

ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఆర్థిక స్థోమత లేనివారు అనే తేడా లేకుండా, విచక్షణారహితంగా వ్యక్తులకు రాష్ట్ర ప్రయోజనాలను పంచడం బుజ్జగింపు తప్ప మరొకటి కాదని, ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవలి ఎన్నికలలో కొన్ని రాష్ట్రాల్లో ఏమి జరిగిందో తనకు తెలుసని కోర్టు పేర్కొంది.. అక్కడ ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా సంక్షేమ పథకాలు ప్రకటించారు.. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను ప్రకటిస్తే, ప్రజలు ఇకపై పని చేస్తారా..? అని కోర్టు ప్రశ్నించింది.

విద్యుత్ సవరణ నియమాలు 2024లోని నిబంధన 23ని సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us