AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: ఏసీ వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా..? ఈ రెండు ట్రిక్స్ పాటిస్తే మీ డబ్బులు ఆదా.. ఆ పొరపాటు చేయకండి

ఎండల క్రమంలో ఇళ్లల్లో ఏసీల వినియోగం పెరిగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉండటంతో ఏసీలు ఆన్ చేసే ఉంచుతున్నారు. అయితే ఏసీలు ఎక్కువకాలం పనిచేయాలంటే అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ ఉంచుకోవాలనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఎక్కడ పెడితే విద్యుత్ ఆదా అవుతుందో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Apr 17, 2026 | 7:26 AM

Share
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో జనాలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడం లేదు. అయితే ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇళ్లల్లో ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. సమ్మర్ క్రమంలో ఏసీల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇంట్లో ఏసీని పెట్టుకున్నప్పుడు అవుట్ డోర్ యూనిట్ నీడలో ఉంచాలా..? లేదా ఎండలో ఉంచాలా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎక్కడ ఉంచితే ఎక్కువ చల్లదనం వస్తుందనేది చూద్దాం.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవుట్ డోర్ యూనిట్‌ను ఎప్పుడూ నీడలోనే ఉంచాలి. నీడలోని దానిని బిగించుకోవాలి. దీని వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా ఎక్కువ కాలం పనిచేస్తుంది. అదే ఎండలో ఉంచడం వల్ల తక్కువ కూలింగ్ రావడమే కాకుండా విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించుకుంటోంది. 10 నుంచి 15 శాతం వరకు ఎక్కువ కరెంట్‌ను ఉపయోగించడం వల్ల మీ కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అందుకే నీడలోనే ఇన్‌స్టాల్ చేయించుకోండి.

2 / 5
ఇక అవుట్ డోర్ యూనిట్ అనేది గదిలోని వేడిని గ్రహించి బయటకు పంపుతుంది. మీరు నీడలో ఉంచడం వల్ల కండెన్సర్ కాయిల్స్ చల్లగా ఉంటాయి. కంప్రెసర్‌పై ఒత్తిడి తగ్గి విద్యుత్‌ను ఆదా చేస్తోంది. అంతేకాకుండా గదిని త్వరగా చల్లగా చేస్తుంది. అదే ఎండలో ఉంటే గదిలోని వేడిని తొలగించడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ఇక ఎండలో ఉంచడం వల్ల కంప్రెసర్ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. దానిపై ఎండ పడటం వల్ల కంప్రెసర్ భాగాలు దెబ్బతింటాయి. దీని వల్ల అవుట్ డోర్ యూనిట్ జీవితకాలం అనేది తగ్గిపోతుంది. కంప్రెసర్ అనేది అత్యంత ముఖ్యమైన భాగం. అదే నీడలో ఉంచడం వల్ల కంప్రెసర్ ఎక్కువకాలం పనిచేస్తుంది. నీడలో ఉంచడం వల్ల దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు ఎక్కువకాలం పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఇక అవుట్ డోర్ యూనిట్‌ను ఇరుకుగా ఉన్న ప్రదేశంలో పెట్టకూడదు. దాని చుట్టూ 1 నుంచి 2 అడుగుల స్థలం ఉంది. వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. వెంటిలేషన్ లేకపోతే అది విడుదల చేసే గాలిని అదే పీల్చుకుంటుంది. దీని వల్ల కూలింగ్ సామర్థ్యం అనేది తగ్గుతుంది. అందుకే ఖాళీ ప్రదేశంలో బిగించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇరుకు ప్రదేశాల్లో పెడితే నష్టం జరుగుతుందని అంటున్నారు.

5 / 5
Follow Us