Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఎంతపనిచేశావమ్మ..? ఇద్దరు కుమార్తెలను చంపి.. వివాహిత ఏం చేసిందంటే..

Visakhapatnam District: ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. సాఫిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంటుంది. ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత

AP News: ఎంతపనిచేశావమ్మ..? ఇద్దరు కుమార్తెలను చంపి.. వివాహిత ఏం చేసిందంటే..
Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 01, 2022 | 9:32 AM

Visakhapatnam District: ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. సాఫిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంటుంది. ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి (Anakapalle) లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం (srikakulam) జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దనరావుకు.. అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. జనార్దనరావు అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అనకాపల్లి ఉమ్మలాడ రోడ్డులోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు సుదీక్ష (5), ఏడాదిన్నర పాప గీతాన్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనార్దనరావు ఉద్యోగానికి సెలవు పెట్టి శనివారం స్వగ్రామం మెట్టపేటకు వెళ్లాడు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసరికి.. అనూష ఇంట్లో ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. కుమార్తెలిద్దరూ కింద విగతజీవులుగా కనిపించారు.

వారిని చూసిన వెంటనే జనార్దనరావు పోలీసులకు సమాచారమిచ్చాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. కుమార్తెలు ఇద్దర్నీ చున్నీతో ఉరి వేసి.. వారిద్దరూ చనిపోయాక అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. సూసైడ్ నోట్ అనూష రాసిందేనా..? లేకపోతే మరెవరైనా రాశారా..? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌లోని వివరాలు, బంధువులు ఇచ్చిన సమాచారం.. భర్త ఇచ్చిన వివరాలు సేకరించిన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Also Read:

YS Jagan: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ

కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణం.. అసలేం జరిగిందంటే..