5G Smartphone: 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఏది కొనాలనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.? ఈ బడ్జెట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ తరుణంలో చాలా మంది 5జీ సపోర్ట్‌ చేసే ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Oct 02, 2022 | 4:00 PM

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో సేవలు అందుబాటులోకి రాగా, మరికొన్ని రోజుల్లోనే అన్ని నగరాల్లోనూ 5జీ ప్రారంభం కానుంది. ఈ నేథ్యంలో కొన్ని తక్కువ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ వివరాలు మీకోసం..

1 / 6
Moto G51: 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,999గా ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఈ ఫోన్‌ సొంతం. సింగిల్ చార్జింగ్‌తో 30 గంట‌ల పాటు ప‌ని చేయ‌గ‌లదు. 6.8 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

2 / 6
Poco M4 Pro: 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 14,999, 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999గా ఉంది. 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమరా, 10 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం. 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్షన్‌ 810 అక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 6
Realme narzo 30 5g: 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999, 6 జీబీ ర్యామ్‌ + 128 స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 16,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే 48 ఎంపీ రెయిర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.

4 / 6
Redmi note 10t: రెడ్‌మీ నోట్‌ 10 టీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,999 కాగా, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+డిస్‌ప్లేను అందించారు.

5 / 6
 Samsung galaxy m13: ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేసిక్‌ వెర్షన్‌ 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11,999, 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,999గా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమరా, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 700 అక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

6 / 6
Follow us