Apple Smart Watch: యాపిల్ నుంచి అతిపెద్ద డిస్ ప్లే తో స్మార్ట్ వాచ్.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రస్తుత వాచ్ అల్ట్రా 1.93-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 2024 వచ్చే మోడల్ దాదాపు 10 శాతం పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అంటే 50 మి.మీ. కంటే ఎక్కువ కేస్ పరిమాణం ఉంటుందని భావిస్తున్నారు.
యాపిల్.. యువతకు ఓ కలల బ్రాండ్.. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ఇలా ఏదైనా యాపిల్ కంపెనీవి వాడితే చాలు అనుకునే వారు ఉంటారు. అందుకనుగుణంగా ఆ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు వివిధ రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అది విడుదల చేసే మోడళ్లపై జనాలకు బాగా ఆసక్తి ఉంటుంది. ఇదే క్రమంలో యాపిల్ కంపెనీ నుంచి అధునాతన స్మార్ట్ వాచ్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
2.1 అంగుళాల డిస్ ప్లేతో..
యాపిల్ వచ్చే ఏడాది 2.1 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో కొత్త యాపిల్ వాచ్ అల్ట్రాను విడుదల చేయనుంది. ఈ మేరకు హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ పు గత నెలలో మీడియాతో తెలిపారు. ప్రస్తుత వాచ్ అల్ట్రా 1.93-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 2024 వచ్చే మోడల్ దాదాపు 10 శాతం పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అంటే 50 మి.మీ. కంటే ఎక్కువ కేస్ పరిమాణం ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే యాపిల్ స్మార్ట్ వాచ్ అన్నింట్లోకి ఇదే పెద్దది అవుతుంది. అలాగే దీనిలో కొత్త అల్ట్రా మైక్రో ఎల్‌ఇడి డిస్‌ప్లే టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది OLED డిస్‌ప్లేలతో ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే అధిక బ్రైట్ నెస్, తక్కువ విద్యుత్ వినియోగం, మెరుగైన కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. అయితే మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉత్పత్తి ఖర్చులు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నందున, దీని తయారీకి మరింత సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో పెద్దగా స్పెసిఫికేషన్లు అప్ గ్రేడ్ లేని కారణంగా 2023లో ఆపిల్ వాచ్ అమ్మకాలు కూడా తగ్గుతాయని అంచనావేస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు
యాపిల్ వాచ్ అల్ట్రాను ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియంతో తయారు చేశారు. 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చే రెటీనా డిస్‌ప్లే దీని సొంతం. ఇది ఫ్లాట్ సెఫైర్ ఫ్రంట్ క్రిస్టల్ కేస్‌తో వస్తుంది. యాపిల్ అల్ట్రా వాచ్ అనేక అడ్వాన్స్‌డ్ టెంపరేచర్ మానిటరింగ్ ఫీచర్లతో వస్తుంది. -4° F (-20° C) వద్ద గడ్డకట్టే మంచు పర్వతాలు, 131° F (55° C) వద్ద మండే ఎడారి వేడిని కూడా ఇది తట్టుకోగలదు. అలాగే ఏ పరిస్థితుల్లోనైనా వాయిస్ కాల్స్‌లో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి యాపిల్ వాచ్ అల్ట్రాలో మూడు ఇంటర్నల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. ఇది అడాప్టివ్ బీమ్‌ఫార్మింగ్ అల్గారిథమ్‌ని కూడా ఉపయోగిస్తుంది. యాంబియంట్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్‌ను తగ్గించేటప్పుడు వాయిస్‌ను క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్లను ఉపయోగిస్తుంది, దీని ద్వారా అద్భుతమైన సౌండ్ క్లారిటీ వస్తుంది. దీని ధర రూ. 90,000 వరకూ ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..