Oppo Phones: తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కావాలా? ఒక్కసారి అప్పో ఫోన్స్ పై లుక్కెయ్యండి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అప్పో కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. కేవలం రూ.12,000 లోపు ధరలోనే వివిధ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Oppo Phones: తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కావాలా? ఒక్కసారి అప్పో ఫోన్స్ పై లుక్కెయ్యండి
Oppo Store
Follow us
Srinu

|

Updated on: Feb 04, 2023 | 2:14 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా అంతా ఫోన్లను వాడుతున్నారు. దీంతో ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు తమ ఫోన్స్ ను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. అయితే వీటిల్లో మధ్యతరగతి బడ్జెట్ లో ఉన్న ఫోన్లే ఎక్కువగా జనాధరణ పొందుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన కంపెనీలు కేవలం మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తే ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే బాటలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అప్పో కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. కేవలం రూ.12,000 లోపు ధరలోనే వివిధ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ధర తక్కువైనా అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అప్పో రిలీజ్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

అప్పో ఏ 31

ఈ ఫోన్ 6 జీబీ+128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ ఫోన్ ను ఫిబ్రవరి 202ంలో రిలీజ్ చేశారు. 12 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. 6.5 అంగుళాల స్క్రీన్ తో మీడియా టెక్ ప్రాసెసర్ తో పాటు 4280 బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయదు. 

అప్పో ఏ 54 

ఏప్రిల్ 2021 లో రిలీజ్ చేసిన ఈ ఫోన్ 6 జీబీ+128 జీబీ వేరియంట్ లో వినియోగదారులక అందుబాటులో ఉంది. 6.51 అంగుళాల డిస్ ప్లేతో మీడియా టెక్ ప్రాసెసర్ తో పాటుగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 13 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటుగా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ మధ్య తరగతి వారిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అప్పో ఏ 15 ఎస్

డిసెంబర్ 2020లో విడుదల చేసిన ఈ ఫోన్  4జీబీ+64 జీబీ ర్యామ్ తో వస్తుంది. అలాగే 13 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటుగా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. 6.5 అంగుళాల స్క్రీన్ తో మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ తో పాటు 4280 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. అలాగే ఈ ఫోన్ కు 256 జీబీ నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ఈ ఫోన్ కు ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం లేదు. 

అప్పో ఏ 16 

సెప్టెంబర్ 2021 లో రిలీజ్ చేసిన ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 6.52 అంగుళాల డిస్ ప్లేతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ తో వచ్చే ఈ ఫోన్ లో 13 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లేదు.

అప్పో ఏ 16 ఈ

మార్చి 25, 2022 న ప్రారంభించిన ఈ ఫోన్ 6.52 అంగుళాల డిస్ ప్లేతో మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 11 తో పని చేసే ఈ ఫోన్ లో 4230 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 4 జీబీ+ 64 జీబీ ర్యామ్ తో ఇది వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఫాస్ట్ చార్జింగ్ వంటి సదుపాయాలు ఈ ఫోన్ కు లేవు.

ఇవే కాదు అప్పో ఏ 15, ఏ 17 కె, ఏ 5S,  వంటి ఫోన్లు కూడా రూ.12,000 లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్స్ లో మీ అవసరాలకు ఏ ఫోన్ సరిపోతుందో చూసుకుని కొనుగోలు చేయాలి. అలాగే ఈ ఫోన్లు అన్ని ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!