AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 14: యాపిల్ ఐఫోన్‌పై భారీ ఆఫర్..ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు..! వివరాలివే..

ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 కొనాలని ఆలోచిస్తున్నారా..? మీ కోసమే వచ్చేసింది సదావకాశం. మీరు కోరుకున్న ధర కంటే చౌకగానే కోనుగోలు..

Apple iPhone 14: యాపిల్ ఐఫోన్‌పై భారీ ఆఫర్..ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు..! వివరాలివే..
Iphone 14
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 05, 2023 | 9:50 AM

Share

ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 కొనాలని ఆలోచిస్తున్నారా..? మీ కోసమే వచ్చేసింది సదావకాశం. మీరు కోరుకున్న ధర కంటే చౌకగానే కోనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 5 నాటికి ఈ కామర్స్ యాప్ ఫ్లిప్‌కార్టులో ఉన్న ఆఫర్ ప్రకారం యాపిల్ ఐఫోన్ 14 కొనుగోలు ధరపై తగ్గింపు ఉంది. ఇండియన్ మార్కెట్‌లో iPhone 14 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 అయినప్పటికీ, Flipkartలో ఈ ఫోన్ ఇంకా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ యాపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.72,499కే అందుబాటులో ఉంది. ఇది కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ.నాలుగు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేనా..? దీంతోపాటు రూ.23 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందింస్తున్నారు.  మీరు ఈ అన్ని ఆఫర్‌లను ఉపయోగించినట్లయితే ఐఫోన్ 14ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు

ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 14తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి