Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Number Plates: ఎందుకు ‘నెంబర్ ప్లేట్స్’ వేర్వేరు రంగుల్లో ఉంటాయి..? కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Number Plates: ఏ వాహనానికైనా నెంబర్ ప్లేట్ అనేది కచ్చితంగా ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకపోవడం అంటే ఏ దేశంలోనైనా నేరమే, ఇంకా ట్రాఫిక్ నియమాలకు విరుద్ధం. అయితే ఒకసారి..

Number Plates: ఎందుకు ‘నెంబర్ ప్లేట్స్’ వేర్వేరు రంగుల్లో ఉంటాయి..? కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Various Colours Of Number Plates Of Vehicles
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 03, 2023 | 8:05 AM

Number Plates: ఏ వాహనానికైనా నెంబర్ ప్లేట్ అనేది కచ్చితంగా ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకపోవడం అంటే ఏ దేశంలోనైనా నేరమే, ఇంకా ట్రాఫిక్ నియమాలకు విరుద్ధం. అయితే ఒకసారి ఈ నెంబర్ ప్లేట్లను మీరు గమనిస్తే అవి వివిధ రంగుల్లో ఉంటాయి. తెలుపు రంగు, నలుపు రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు ఇలా రకరకాల రంగుల్లో నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు అన్ని నెంబర్ ప్లేట్లు ఒకే రంగులో ఉండవు..? వివిధ రంగులలో ఉండే నెంబర్ ప్లేట్లను రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్(ఆర్‌టీఓ) జారీ చేస్తుంది. అలాగే మనదేశంలో మొత్తం తొమ్మిది రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. మరి అవి ఎందుకు వేరు వేరు రంగులలో ఉంటాయనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నెంబర్ ప్లేట్లలో రకాలు: 

  • తెలుపు రంగు
  • ఆకుపచ్చ రంగు
  • పసుపు రంగు
  • ఎరుపు రంగు
  • నీలం రంగు
  • నలుపు రంగు
  • బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్జా
  • తీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్

Number Plates

ఇవి కూడా చదవండి
  1. తెలుపు రంగు నెంబర్ ప్లేట్: తెలుపు రంగులో ఉండే  నెంబర్ ప్లేట్‌లో అక్షరాలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి. ఈ రంగు నంబర్ ప్లేట్ ఉంటే.. ఆ వాహనం సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వాహనం అని అర్ధం. ఇది కేవలం పెర్సనల్ యూజ్ కోసమే.
  2. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్: వాహనానికి ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్ ఉంటే అది ఎలక్ట్రిక్ వాహనమని అర్థం. ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు వంటి వాటికి ఈ ప్లేట్లు ఇస్తారు. వీటి మీద తెల్లని రంగులో అక్షరాలు ఉంటాయి.
  3. పసుపు రంగు నెంబర్ ప్లేట్: నగరాల్లో ఎక్కువగా పసుపు రంగు నెంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి.  బస్సులు, క్యాబులు వంటి కమర్షియల్ పర్పస్, ట్రాన్స్‌పోర్ట్ కోసం వాడే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్‌ను ఇస్తారు. ఈ రంగు నంబర్ ప్లేట్‌లపై నల్లని అక్షరాలు మీద ఉంటాయి.
  4. ఎరుపు అక్షరాల నెంబర్ ప్లేట్: ఎరుపు రంగు‌ అక్షరాలతో నెంబర్ ప్లేట్ ఉంటే అది తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్. శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ వచ్చే వరకు దీన్ని ఇస్తారు.
  5. నలుపు రంగు నెంబర్ ప్లేట్: కమర్షియల్ వాహనాలుగా రిజిస్టర్ అయిన వాహనాలకు నలుపు రంగు నెంబర్ ప్లేట్ ఇస్తారు. వీటిపై పసుపు రంగు అక్షరాలు ఉంటాయి.
  6. నీలం రంగు నెంబర్ ప్లేట్: నీలం రంగు నెంబర్ ప్లేట్.. దాని మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటే అది విదేశీ దౌత్యవేత్తల వాహనం అని అర్థం. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వ్యక్తులు కోసం ఈ కార్లని వాడతారు. CC- కాన్సులర్ కార్ప్స్, UN- యునైటెడ్ నేషన్స్, DC- డిప్లొమాటిక్ కార్ప్స్ వంటి వాళ్లకి ఈ  రంగు నంబర్ ప్లేట్‌లను ఇస్తారు.
  7. నలుపు రంగులో పైకి బాణం గుర్తు వుండే నెంబర్ ప్లేట్: మిలిటరీ వాహనాలకు ఇలాంటి నంబర్ ప్లేట్‌లను వాడతారు. ఇలా బాణం పైకి ఉన్న వాహనాలను బ్రాడ్ ఏరో వెహికిల్స్ అంటారు.
  8. జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్: రాష్ట్ర గవర్నర్ ఉపయోగించే వాహనాలకు ఈ విధమైన నంబర్ ప్లేట్ ఉంటుంది. ఒకవేళ జాతీయ చిహ్నం బంగారు రంగులో ఉన్నట్టయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం అని అర్థం.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..