Telangana: ఓ రైతన్న తెలివి.. చిన్న ఫ్యామిలీ సౌకర్యవంతంగా జీవించేలా 3 లక్షల ఖర్చుతో 10 రోజుల్లో ఇల్లు నిర్మాణం.. ఎక్కడంటే..
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకోవడం అందరికి సాధ్యం కాదేమోనిపిస్తుంది.. రోజు రోజుకీ పెరుగుతున్న నిర్మాణం ఖర్చుతో.. అయితే పది రోజుల్లోనే ఇళ్లుని నిర్మించారు. అది కూడా ఖర్చు కేవలం మూడు లక్షలే..! వినడానికి వింతంగా ఉన్నా...ఇది నిజమేనండీ బాబూ..! ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా..

ఇల్లు కట్టి చూడు…పెళ్లి చేసి చూడు అన్న సామెత తెలుగునాట అందరికి సుపరిచితమే. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అంత కష్టమైన పని. ఎందుకంటే ఓ చిన్నపాటి గది కట్టడానికే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక ఓ నలుగురు నివాసం ఉండే ఇళ్లు కట్టాలన్నా కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం పైనే పడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి తన వ్యవసాయభూములో కేవలం పదిరోజుల్లోనే ఇళ్లు కట్టేశాడు. అది కూడా కేవలం మూడు లక్షల ఖర్చుతో చక్కని ఇళ్లు నిర్మించాడు. ఇప్పుడు ఈ చిన్న ఇల్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఖమ్మంజిల్లా చిలుకూరులో కూడలి ఏటిఒడ్డున కోదాడకు చెందిన నాగేశ్వరరావు 15 ఎకరాల వ్యవసాయభూమి కొన్నాడు. అందులో ఫామ్ ఆయిల్ మొక్కాలు వేశాడు. పొలం చూసేందుకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. వచ్చినప్పుడల్లా ఎక్కడుండాలి అనే ఆలోచనలో పడ్డ నాగేశ్వరరావు తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ఉండేలా ఆలోచించి, గుంటూరులో రెండున్నర లక్షలతో తయారుచేసిన ఓ కంటైనర్ తెప్పించాడు. 50వేల ఖర్చుతో పొలంలో పిల్లర్లు వేసి, కంటైనర్‌ను బిగించాడు. దాంతో ఈ ఇంటి నిర్మాణం కేవలం 10 రోజుల్లోనే పూర్తయింది. కంటైనర్‌లో బెడ్‌రూమ్, అటాచ్ బాత్రూం, వంటగది ఉన్నాయి. ఓ చిన్న ఫ్యామిలీ సౌకర్యవంతంగా జీవించేలా ఉన్న ఈ ఇంటిని అటువైపు నుంచి వెళ్లే వారంతా చూసి ఆశ్చర్యపోతున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..