LIC WhatsApp Services: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ఇకపై ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారా కూడా..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీదారులకు ఎల్‌ఐసీ వాట్సాప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎల్ఐసీ వినియోగదారులు ఇంట్లో కూర్చునే అనేక ప్రయోజనాలను..

ప్రస్తుతం వాడుతున్న సోషల్ మీడియాలలో WhatsApp వాడకం భారీస్థాయిలో ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన పాలసీదారులకు ఎల్‌ఐసీ వాట్సాప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎల్ఐసీ వినియోగదారులు ఇంట్లో కూర్చునే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా మీకు కావల్సిన సమాచారం కోసం ఎల్‌ఐసీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం లేదా ఎల్‌ఐసీ ఏజెంట్లను సంప్రదించడం లేదా ఎల్‌ఐసీ ఆఫీసులకు వెళ్లడం వంటి కాలయాపన చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. దేశవ్యాప్తంగా ఉన్న తన కోట్లాది కస్టమర్ల కోసం WhatsApp సేవలను LIC ప్రారంభించింది. డిసెంబర్ 02, 2022 నుంచి ఈ తరహా మొట్టమొదటి ఇంటరాక్టివ్ సేవను కంపెనీ ప్రారంభించింది.
ఈ వాట్సాప్ సేవ ద్వారా మీ ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించిన చాలా సమాచారం, ప్రీమియం చెల్లింపు చివరి తేదీ సహా అనేక సౌకర్యాలను పొందవచ్చు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే, ఇది ఇంకా సులభం అవుతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఎల్‌ఐసీ అందించే వాట్సాప్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, మీరు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే వినియోగదారులు LIC WhatsApp Services ప్రయోజనాన్ని పొందుతారు.




వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల జాబితా:
LIC launches its WhatsApp Services#LIC #WhatsApp pic.twitter.com/vBO4c86xLr
— LIC India Forever (@LICIndiaForever) December 2, 2022
- ప్రీమియం బకాయి.
- బోనస్ సమాచారం
- పాలసీ స్థితి
- మీ ప్రస్తుత పాలసీ మీద ఎంత రుణం తీసుకోవచ్చు?
- రుణం తిరిగి చెల్లింపు
- రుణం మీద వడ్డీ బకాయి
- ప్రీమియం చెల్లింపు పత్రం
- యులిప్ (ULIP) యూనిట్ల స్టేట్‌మెంట్
- ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింక్‌లు
- ఆప్ట్ ఇన్ /ఆప్ట్ ఔట్ సేవలు
- ఎండ్ కన్వర్జేజన్
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి