Samsung laptop: శామ్సంగ్ నుంచి సరికొత్త ల్యాప్ టాప్.. హెచ్ డీ వెబ్ క్యామ్ తో.. ఫీచర్లు మామూలుగా లేవుగా…

శామ్సంగ్ గెలాక్సీ బుక్ అల్ట్రా, గెలాక్సీ బుక్ 3 ప్రో 360, బుక్ 3 ప్రో పేరిట మూడు మోడళ్లను విడుదల చేసింది. వాటిల్లో అల్ట్రా మోడల్ అధిక సామర్థ్యంతో కూడిన మోడల్ గా కనిపిస్తోంది.

Samsung laptop: శామ్సంగ్ నుంచి సరికొత్త ల్యాప్ టాప్.. హెచ్ డీ వెబ్ క్యామ్ తో.. ఫీచర్లు మామూలుగా లేవుగా...
Samsung Galaxy Book 3 Ultra
Follow us
Madhu

|

Updated on: Feb 03, 2023 | 5:25 PM

శామ్సంగ్ తన వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడంతో పాటు, అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇదే క్రమంలో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 తో ని లాంచ్ చేసింది. దీనితో పాటు కొత్త గెలాక్సీ బుక్ నోట్ బుక్ మోడళ్లను ఆవిష్కరించింది. శామ్సంగ్ గెలాక్సీ బుక్ అల్ట్రా, గెలాక్సీ బుక్ 3 ప్రో 360, బుక్ 3 ప్రో పేరిట మూడు మోడళ్లను విడుదల చేసింది. వాటిల్లో అల్ట్రా మోడల్ అధిక సామర్థ్యంతో కూడిన మోడల్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ బుక్ అల్ట్రా సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలను శామ్సంగ్ కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 అల్ట్రా లో 16 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ ప్లే ఉంటుంది. 120 Hz ఫ్రీక్వెన్సీ తో రిఫ్రెష్ రేటు ఉంటుంది. దీనిలో ఇంటెల్ కోర్ i9-13900H సీపీయూ ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం ఎన్ విడా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4070 జీపీయూతో వస్తుంది. దీనిలో 32 జీబీ ఎల్డీడీఆర్5 ర్యామ్ తో వస్తుంది.

ఫీచర్లు ఇవి..

ఈ ల్యాప్ టాప్ లో ఫుల్ సైజ్ బాక్ లిట్ కీబోర్డు, విండోస్ ప్రిసిషన్ ట్రాక్ ప్యాడ్ ఉంటుంది. ఫుల్ హెడీ రిజల్యూషన్ తో కూడిన వెబ్ క్యామ్ ప్రత్యేక ఆకర్షణ. దీంతో ప్రత్యేకించి మంచి వీడియో కాన్ఫరెన్స్ లకు బాగా ఉపకరిస్తుంది. అలాగే పలు రకాల కనెక్టవిటీ ఆప్షన్లు ఉన్నాయి. థండర్ బోల్ట్ 4( యూఎస్బీ టైప్ సీ) పోర్ట్, యూఎస్బీ 3.2 టైప్ ఏ పోర్టు, హెచ్డీఎంఐ 1.4 పోర్టు, ఒక మైక్రో ఎస్డీ కార్డు స్లాట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇన్ బిల్డ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

పవర్ ఇన్ పుట్స్ ఇలా..

దీనిలోని బ్యాటరీ 76 Wh సామర్థ్యంతో పనిచేస్తుంది. అలాగే 100 W ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో వస్తోంది. దీని ద్వారా వేగంగా చార్జ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనిలో ప్రీ ఇన్ స్టాల్డ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది.

మరిన్ని అధునాతన ఫీచర్లు..

ఈ శామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 లో సాంప్రదాయ ఫీచర్లతో పాటు మరిన్ని అధునాతన ఫీచర్లను కూడా అందిస్తుంది. వాటిల్లో ఎక్స్ పర్ట్ రా ఆటో షేర్.. దీంతో గెలాక్సీ స్టార్ట్ ఫోన్ నుంచి ఆటోమేటిక్ గా ల్యాప్ టాప్ లోకి తీసుకోవచ్చు. అలాగే స్మార్ట్ స్విచ్, ప్రైవేట్ షేర్, క్విక్ షేర్, శామ్సంగ్ మల్టీ కంట్రోల్, శామ్సంగ్ పాస్, సెకండ్ స్క్రీన్, స్టూడియో మోడ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. దీని ధరను శామ్సంగ్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..