AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: జీ20 సదస్సులో ఖతర్నాక్‌ కేటుగాళ్లు.. వీఐపీ కారులో వచ్చి చోరీలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?

ఈ వీడియో ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ వీడియోని షేర్‌ చేస్తున్నారు. సంఘటనపై తమ స్పందన తెలియజేస్తున్నారు. వీడియోతో పాటు,..

Watch: జీ20 సదస్సులో ఖతర్నాక్‌ కేటుగాళ్లు..   వీఐపీ కారులో వచ్చి చోరీలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
G20 Summit
Jyothi Gadda
| Edited By: |

Updated on: Sep 09, 2023 | 12:02 PM

Share

గుర్గావ్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీలను దొంగిలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీఐపీ లైసెన్స్ ప్లేట్ ఉన్న అధునాతన వాహనంలో వచ్చిన వీరు పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను తీసుకొని వారి లగ్జరీ కారు ట్రంక్‌లో పెట్టుకుంటున్న వీడియోలో వైరల్‌గా మారింది. G20 సమ్మిట్ పోస్టర్‌తో పాటు, ఆ ప్రాంతంలో రంగురంగుల పూల కుండీలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గురుగ్రామ్‌లోని శంకర్ చౌక్‌లో జరిగిన G20 ఈవెంట్ ప్రాంగణంలో ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను దొంగిలించిన వీడియోను జర్నలిస్ట్ రాజ్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ వీడియోని షేర్‌ చేస్తున్నారు. సంఘటనపై తమ స్పందన తెలియజేస్తున్నారు. వీడియోతో పాటు, “#కియా కారు డ్రైవర్ గురుగ్రామ్‌లోని శంకర్ చౌక్‌లో పట్టపగలు మొక్కల కుండీలను దొంగిలిస్తున్నాడు” అంటూ వర్మ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు గురుగ్రామ్ పోలీసు అధికారులు, డిప్యూటీ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. దీంతో కేసు జిల్లా కలెక్టర్‌కు చేరగా, విచారణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను ఎందుకు దొంగిలించారనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, వీడియోలో దొంగతనం చేస్తున్నారనేది మాత్రం హైలైట్ చేస్తుంది. వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు నేరస్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుగ్రామ్ పోలీసులచే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది వినియోగదారులు వాహనం నంబర్ ప్లేట్‌ను గుర్తించడానికి వీడియో ఫుటేజీని జూమ్ చేసి చూస్తున్నారు. దానిని VIP క్యారేజ్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి