Viral News: రక్షించండి మహాప్రభో…! గాయపడిన కోడితో పోలీస్‌ స్టేషన్‌ చేరిన దంపతులు…

దంపతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని ఒప్పించి ఇంటికి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ప్రసాద్ సిన్హా తెలిపారు.

Viral News: రక్షించండి మహాప్రభో...! గాయపడిన కోడితో పోలీస్‌ స్టేషన్‌ చేరిన దంపతులు...
Attempt To Kill A Chicken
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 28, 2023 | 6:39 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తన కోడిని చంపేందుకు ప్రయత్నించారని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ గాయపడిన కోడితో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తమ ఇరుగుపొరుగు వారే కోడిని దొంగిలించి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇరుగుపొరుగు వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఫిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ ఈ కంప్లైట్‌ చేసింది. తాను కోళ్లను పెంచుతుంటానని, ఆ కోళ్లు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుంటాయని చెప్పింది. ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కోళ్లలో ఒకదానిని చంపేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

తన ఇంటికి ఇరుగుపొరుగు వారే తన కోడిని చంపి తినేయాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళతో పాటు ఆమె భర్త మలిక్రం కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కోడిపిల్లను దొంగిలించి చంపేందుకు ప్రయత్నించిన కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని దంపతులు డిమాండ్ చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇంతకు ముందు పక్కింటి వారు కూడా ఇలాగే కోడిని దొంగిలించారని, ఈ విషయమై ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు తనను చంపుతామని బెదిరించారని కూడా వారు పోలీసులకు వివరించారు.

గాయపడిన కోడిని చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన దంపతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని ఒప్పించి ఇంటికి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ప్రసాద్ సిన్హా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ