Optical illusion: ఈ ఫొటోలో ఓ పిల్లి నక్కి నక్కి చూస్తోంది.. కనిపెట్టే సత్తా మీకుందా.?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాస్త భిన్నంగా ఏ అంశమైనా ఇట్టే వైరల్ అవుతోంది. ఫొటోల నుంచి మొదలు వీడియోల వరకు ప్రతీది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలో..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాస్త భిన్నంగా ఏ అంశమైనా ఇట్టే వైరల్ అవుతోంది. ఫొటోల నుంచి మొదలు వీడియోల వరకు ప్రతీది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలో మెదడు చురుకుతనాన్ని పరీక్షించేవి కొన్ని అయితే, ఐ పవర్‌ను టెస్ట్ చేసేవి కొన్ని. ఫొటోలకు సంబంధించిన ఆప్టికల్ ఇల్యూజన్స్ నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముంది చెట్లు, ఏండిన ఆకులు, అక్కడక్కడ రాళ్లు అంటారా.? అయితే వీటి నడుమ ఓ పిల్చి దాక్కుంది. దమ్ముంటే నన్ను కనిపెట్టండి అన్నట్లు నక్కి నక్కి చూస్తోంది. అయితే ఈ ఫొటో ఫొటోగ్రాఫర్ కంట పడింది. వెంటనే తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. ఫొటోల ఉన్న పిల్లిని కనిపెట్టండని పోస్ట్ చేయగానే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న పిల్లిని మీరు గుర్తించారా.? ఓసారి ఫొటోలో మధ్యలో తీక్షణంగా, జూమ్ చేసిన చూడండి కెమెరా వైపే చూస్తున్నట్లున్న పిల్లి కనిపిస్తుంది. ఏంటీ ఇప్పటికీ కనిపించలేదా.. అయితే సమాధానం కోసం కింద ఫొటోను చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..