Viral Video: నడిరోడ్డుపై పేలిపోయిన ఈ రిక్షా.. ఇద్దరికి గాయాలు, ఒకరి దుర్మరణం.. కారణం ఏంటంటే..
అయితే ఈ పేలుడులో ఈ-రిక్షా డ్రైవర్, టపాసులు కాలుస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫైర్ క్రాకర్స్ కాల్చే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా సామాగ్రితో వెళ్తున్న ఈ-రిక్షాలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. అప్పటికే ఆ ప్రాంతంలో జగన్నాథుని శోభాయాత్ర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. యాత్రకు సంబంధించిన సామాగ్రితో ముందు వెళ్తున్న ఈ-రిక్షా ఒకటి ఓ దుకాణం ముందు ఆగింది. అక్కడ ఆగిన కాసేపటికే ఆ రిక్షా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనం షాకయ్యారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ-రిక్షాకు మంటలు అంటుకుని పటాకులు పేలుస్తున్న దృశ్యం రోడ్డుపై ఉన్న ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కానీ, కాసేపటికి అందరూ షాక్ నుంచి తేరుకున్నారు. ఈ-రిక్షాలో ఉన్న టపాసులకు నిప్పంటుకుని పేలిపోయాయని గ్రహించారు. వెంటనే నీళ్ల బకెట్లు, ఆక్సిజన్ సిలిండర్లతో మంటలను ఆర్పేశారు. అయితే ఈ పేలుడులో ఈ-రిక్షా డ్రైవర్, టపాసులు కాలుస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫైర్ క్రాకర్స్ కాల్చే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని దాద్రి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
थाना दादरी क्षेत्रांतर्गत कस्बा दादरी में जगन्नाथ शोभा यात्रा के दौरान आतिशबाजी के समान में आग लग गई। इस घटना में 02 व्यक्ति घायल हो गए जिनको इलाज हेतु हॉस्पिटल भेजा गया है, आवश्यक कार्यवाही की जा रही है। उक्त प्रकरण में एडीसीपी ग्रेटर नोएडा द्वारा दी गयी बाइट। pic.twitter.com/UFYa1NfukL
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) February 27, 2023
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగన్నాథుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం కోసం నిర్వాహకులు భారీగా పటాసులు తెప్పించారని, ఆ పటాసులను ఓ ఈ-రిక్షాలో పెట్టుకుని ఒక్కో ప్యాకెట్ తీసి కాలుస్తూ ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలో కాల్చిన పటాసులకు సంబంధించిన నిప్పురవ్వలు ఈ-రిక్షాలోని క్రాకర్స్ కాటన్‌లపై పడటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..