Telangana: రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న పేపర్ లీకేజ్.. బండి సంజయ్‌కి నోటీసులు..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్‌ నోటీసులు కాక రేపుతున్నాయి.

Telangana: రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న పేపర్ లీకేజ్.. బండి సంజయ్‌కి నోటీసులు..
Bandi Sanjay
Follow us

|

Updated on: Mar 21, 2023 | 10:30 PM

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్‌ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ వైపు నిందితుల వేట కొనసాగిస్తూనే.. రాజకీయనేతలకు నోటీసులు జారీచేస్తోంది సిట్‌. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీల నేతలకు సిట్‌ నోటీసులు కలకలం రేపుతున్నాయి.

నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌.. ఈ రోజు బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది. రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అతికించి వచ్చారు సిట్‌ అధికారులు. రేవంత్‌ రెడ్డిని ఈనెల 24 న సిట్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. ఈ రోజు బండిసంజయ్‌ని సైతం ఈనెల 24న విచారణకు రావాలని సిట్‌ ఆదేశాలు జారీచేసింది.

పేపర్‌ లీక్‌ ఇష్యూలో ఇటీవల బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. లీకేజ్‌ వ్యవహారంలో కేటీఆర్‌ హస్తముందంటూ విమర్శలు చేశారు బండి సంజయ్‌. బండి సంజయ్‌ ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించిన సిట్‌ అందుకు ఆధారాలు చూపాలంటూ నోటీసులు జారీచేసింది. నోటీసులు ఇచ్చేందుకు బండి సంజయ్‌ ఇంటికి వెళ్ళారు సిట్‌ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరోవైపు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేపర్‌ లీకేజీపై చేసిన కామెంట్స్‌ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. పేపర్‌ లీకేజీలపై విపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపట్టడాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తిప్పికొట్టారు. అంతేకాదు. పేపర్‌ లీకేజీలు సర్వసాధారణమంటూ ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ప్రశ్నాపత్రాలు సర్వసాధారణంగా లీక్‌ అవుతుంటాయంటూ గతంలో పేపర్‌ లీకేజీలను ప్రస్తావించారు మంత్రి.

ఇక మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు భట్టివిక్రమార్క. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని అమ్ముకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యలు దారుణం అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని మంత్రులకు..కనీసం ఇంగితజ్ఞానం కూడా లేదన్నారు భట్టి. మంత్రి తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క.

మరోవైపు సాక్ష్యాలు రాబట్టేందుకు సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. నిన్న రెండోసారి నిందితులతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన సిట్‌.. ఈ రోజు సైతం పేపర్‌ లీకేజ్‌ స్కాంలో ఇన్వాల్వ్‌ అయిన వాళ్ళు ఇంకెవరెవరున్నారనే దానిపై విచారిస్తోంది. కాన్ఫెడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి డైరీ లో రాసుకున్న పాస్‌వర్డ్‌ చోరీ చేసినట్టు చెప్పారు నిందితులు. దీంతో టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి శంకరలక్ష్మిని ప్రశ్నిస్తోంది సిట్. సైబర్‌ క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శంకర్‌లక్ష్మిని విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ నుంచి సీజ్‌ చేసిన కంప్యూటర్లను పరిశీలించారు అధికారులు. అయితే తాను డైరీ లో ఎక్కడా పాస్ వర్డ్ రాయలేదన్నారు శంకర్ లక్ష్మి.

ప్రశ్న పత్రాలు ఎక్కడ స్టోర్ చేస్తారని అడిగి తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు. లాగిన్ యాక్సిస్ ఎవరివరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. లాగిన్ పాస్వర్డ్ క్రియేట్‌ చేసిందెవర? పాస్‌వర్డ్‌ని తరుచూ మారుస్తున్నారా లేదా అని శంకర్‌లక్ష్మిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..