ఎవరైతే మాకేంటి.. మేమింతే అంటూ.. ఏకంగా ఆమెనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..
కొద్ది రోజుల క్రితమే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆల్ ఇండియా ర్యాంకును సాధించింది దొన్నూరు అనన్య రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ లో టాప్ ర్యాంక్ సాధించింది. ఆల్ ఇండియాలో మూడవ ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి ఫలితాలు వెళ్లడైన కొద్ది రోజుల్లోనే పోలీస్‌లను ఆశ్రయించింది. ఏప్రిల్ 27వ తేదీన అనన్య రెడ్డి పోలీసులను ఆశ్రయించింది. తనకి మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా మూడో ర్యాంక్ రావడంతో కొంతమంది కేటుగాళ్లు తనకి తెలియకుండానే తన పేరు మీద కొన్ని సోషల్ మీడియా ఖాతాలను తెరిచారు.

కొద్ది రోజుల క్రితమే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆల్ ఇండియా ర్యాంకును సాధించింది దొన్నూరు అనన్య రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ లో టాప్ ర్యాంక్ సాధించింది. ఆల్ ఇండియాలో మూడవ ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి ఫలితాలు వెళ్లడైన కొద్ది రోజుల్లోనే పోలీస్‌లను ఆశ్రయించింది. ఏప్రిల్ 27వ తేదీన అనన్య రెడ్డి పోలీసులను ఆశ్రయించింది. తనకి మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా మూడో ర్యాంక్ రావడంతో కొంతమంది కేటుగాళ్లు తనకి తెలియకుండానే తన పేరు మీద కొన్ని సోషల్ మీడియా ఖాతాలను తెరిచారు. తనకు సంబంధం లేని ఘటనలపైన అనన్య రెడ్డి పేరుతో పోస్టులు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన అనన్య రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్‌లో తన పేరు మీద అనేక ఖాతాలు తెరిచి ఉంచినట్టు ఆమె గుర్తించింది.
తనకు సంబంధించిన ఫోటోలను ఈ ఫేక్ ప్రొఫైల్స్‌లో పోస్ట్ చేస్తూ నిజమైన వ్యక్తిగా అనుకరిస్తున్నారు. ఆల్ ఇండియా టాప్ యాంకర్ కావటంతో సాధారణంగానే ఇది నిజమైన అకౌంటు ఏమోనని భావించిన చాలామంది ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు టెలిగ్రామ్లోను ఆమె పేరును వాడుకొని కొంతమంది డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనన్య రెడ్డి మెంటల్ షిప్ ప్రోగ్రాం అంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నిర్దిష్ట నగదును సైతం తీసుకుంటున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎక్కడ అలాంటి ప్రోగ్రామ్స్‌లో పాలు పంచుకోవట్లేదని అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమె కోరుతున్నారు. అనన్య రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ క్రైమ్ ఏసిపి రవీంద్రారెడ్డి అనన్య రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




