రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్ డిమాండ్..
రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది RSS మూలసిద్ధాంతం అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అయన. ఈ సందర్భంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అమలుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కుట్రలో భాగంగానే తనపై ఢిల్లీలో అక్రమ కేసు పెట్టారన్నరు. రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని BJPప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే వాజ్‌పేయ్ హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారన్నారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది RSS మూలసిద్ధాంతం అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అయన. ఈ సందర్భంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అమలుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కుట్రలో భాగంగానే తనపై ఢిల్లీలో అక్రమ కేసు పెట్టారన్నరు. రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని BJPప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే వాజ్‌పేయ్ హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారన్నారు. ఆ కమిషన్ నివేదికను సీక్రెట్‌గా ఉంచారని ఈలోపు ఆ సీక్రెట్ ఎజెండాను తాను బయటపెట్టానని కీలక వ్యాఖ్యలు చేశారు. 1960లో గోల్వాల్కర్ రిజర్వేషన్లు అవసరంలేదన్నారు అలాగే 2015లో ఆర్ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య కూడా.. రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారు అంటూ గతాన్ని గుర్తు చేశారు.
BJPకి వేసే ప్రతిఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టేనన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో.. మోదీ, అమిత్‌షా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐని ప్రయోగించినట్టు..తనపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారన్నారు. తాను లొంగిపోతానని ఢిల్లీ సుల్తాన్‌లు అనుకుంటున్నారు. తన ప్రచారాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. భారత్‌ను హిందూదేశంగా మార్చాలన్నది RSS లక్ష్యమని ఆ విధానాలను ఇప్పటికే చాలావరకు మోదీ పూర్తి చేశారన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే.. లోక్‌సభలో 2/3 వంతు సభ్యుల మెజారిటీ ఉండాలని.. అందుకే 400 సీట్లు కావాలంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎవరో వీడియో పెడితే.. ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు అమిత్‌షా ఆధీనంలో ఉన్నారని తమ మహిళా అడ్వొకేట్‌పై దురుసుగాప్రవర్తించారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




