Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్‌గా గాడిద గుడ్డు
గాడిద గుడ్డే కదా అని లైట్ తీసుకోకండి. ఇప్పుడిదే గుడ్డు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నడినెత్తిన తైతక్కలాడుతోంది. రెండు పార్టీలు కయ్యానికి కాలుదువ్వేలా చేస్తోంది. హాట్‌హాట్‌గా సాగుతున్న క్యాంపెయిన్ హీట్‌లో.. ఈ గుడ్డు గోలేంటి? మైకుల్లో ఎందుకు మార్మోగుతోంది?

గాడిద గుడ్డు.. సీఎం రేవంత్ సభల్లో తళుక్కుమంటోంది. తళుక్కుమనడమే కాదూ.. సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సభ ఎక్కడైనా.. వేదిక ఏదైనా.. గాడిద గుడ్డును హైలైట్ చేస్తూ వస్తున్నారు. నెత్తిన పెట్టుకుని మరీ సభకు తరలివచ్చిన ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ప్రచారంలో హస్తానికి ఓటేయాలని చెబుతూనే.. గాడిద గుడ్డును బ్యానర్ ఐటమ్‌గా మార్చేస్తున్నారు సీఎం రేవంత్.
ప్రచారం అన్నాక ప్రత్యర్థులపై విమర్శలుంటాయి.. పంచ్‌లుంటాయి. అంతకుమించి ఊగిపోతూ చేసే ప్రసంగాలు కనిపిస్తాయి. కానీ వీటన్నింటికి భిన్నంగా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును ఎంచుకున్నారు. ప్రధాని మోదీకి.. గాడిద గుడ్డుకి లంకే పెట్టి మరీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్‌పోర్ట్ ఇవ్వమని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. చివరకు ఆయన తెలంగాణకు ఇచ్చింది ఇదేనంటూ గాడిద గుడ్డును సింబాలిక్‌గా చూపిస్తున్నారు.
కాంగ్రెస్ గుడ్.. బీజేపీ గాడిద గుడ్డు అన్నది రేవంత్ వాదనగా కనిపిస్తోంది. ఈ కామెంట్లను మొదట్లో లైట్ తీసుకున్న బీజేపీ.. ఆ తర్వాత కౌంటర్ ఎటాక్‌కి దిగింది. గాడిద అసలు గుడ్డే పెట్టదు.. మరి రేవంత్ రెడ్డి వాటిని ఎలా క్రియేట్ చేశారో అర్థం కావడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు చేయకుండా.. ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని చెబితే బాగుంటుందని సీఎంకు సలహా ఇచ్చారు కిషన్ రెడ్డి. మొత్తానికి ప్రచారంలో ఎవ్వరికెవరూ తగ్గడం లేదు. ఓట్లు రాల్చేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదలడం లేదు. మరి గాడిద గుడ్డు ఎవరికి మైలేజ్ ఇస్తుంది.. ఎవరి ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
