ఆమె కాళ్లకు వేసుకున్న సాక్సుల్లో నల్లటి కవర్లు, వాటి ఖరీదు రూ.కోటికి దగ్గరే…! ఎందుకంటే

కువైట్‌ నుండి వచ్చిన మహిళా ప్రయాణికురాలు కాళ్లకు వేసుకున్న సాక్స్‌పై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. ఏదో తేడా కొడుతుందని భావించిన అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సాక్సుల్లో నల్లటి కవర్లు కనపడ్డాయి.

ఆమె కాళ్లకు వేసుకున్న సాక్సుల్లో నల్లటి కవర్లు, వాటి ఖరీదు రూ.కోటికి దగ్గరే...! ఎందుకంటే
Shamshabad Gold
Follow us

|

Updated on: Jun 16, 2022 | 2:22 PM

బంగారం స్మగ్లర్లు రోజుకో పంథాలో తమ దందా కొనసాగిస్తున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బట్టల బ్యాగుల్లో, చెప్పుల్లో, శరీరంపైనా బంగారం దాచుకొని స్మగ్లింగ్ చేసేవారు. మొన్నామధ్య ముంబయిలో ఇద్దరు మహిళలు ఏకంగా వారి ప్రైవేటు పార్ట్స్ లో దాచిపెట్టి మరి స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. పలు రూపాల్లో పసిడిని అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు తాజాగా..తమ పంథా మార్చుకున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకే షాకిచ్చేలా గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బంగారాన్ని పొడిగా చేసి తరలించేందుకు స్మగ్లర్లు విఫలయత్నం చేశారు. అధికారుల కళ్లుగప్పి గుట్టుగా పసిడిని తరలించేందుకు ప్రయత్నించి కస్టమ్స్‌ అధికారులకు చిక్కారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 86 లక్షల విలువ చేసే అక్రమ బంగారం పట్టుబడింది. కువైట్‌ నుండి వచ్చిన మహిళా ప్రయాణికురాలు కాళ్లకు వేసుకున్న సాక్స్‌పై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. ఏదో తేడా కొడుతుందని భావించిన అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

Shamshabad Gold0

Shamshabad Gold0

ఆ సాక్సుల్లో నల్లటి కవర్లు కనపడ్డాయి. అది చూసిన అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె తెలికి కస్టమ్స్‌ అధికారులే షాక్‌ తిన్నారు. బంగారం పొడి రూపంలో చేసి నల్లటి కవర్ లో కాళ్లకు వేసుకునే సాక్స్ లో దాచుకుని వచ్చింది. బంగారం వెలికి తీసిన కస్టమ్స్ అధికారులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం 1.646 కేజీలు ఉంటుందని అంచనా వేశారు. దాని విలువ దాదాపు 86 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు ఆధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి