Groom Dance: బరాత్‌లో పెళ్లికొడుకు డ్యాన్స్.. సీన్ కట్‌చేస్తే రూ. 2 లక్షలు ఫైన్! కారణం ఏంటంటే
ప్రస్తుతం పెళ్లీలు డీజే సాంగ్స్ తో మోతమోగుతున్నాయి. స్పెషల్ గా డ్యాన్స్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ వెరీ కామన్.. ఆ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ..
ప్రతి ఒక్కరి జీవితంలో ‘పెళ్లి’ అనేది చాలా ప్రత్యేకం. పెళ్లి ఒక మధురమైన ఘట్టం. ఈ పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఒక మెమోరబుల్ మూమెంట్‌గా మార్చుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం పెళ్లీలు డీజే సాంగ్స్ తో మోతమోగుతున్నాయి. స్పెషల్ గా డ్యాన్స్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ వెరీ కామన్.. ఆ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే మండపాల్లో, రిసెప్షన్ స్టేజిపై పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు ఇటీవల అనేకం చూశాం. అయితే, ఇక్కడో పెళ్లి కొడుకు రోడ్డుపై డాన్స్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అక్కడి పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేయగా, వార్త వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పెళ్లి గ్రాండ్‌గా చేసుకున్నాడు. వివాహనంతరం సాయంత్రం బరాత్ నిర్వహించారు. అందులో భాగంగా వరుడు, అతడి మిత్రబృందం ఎనిమిది కార్లతో జాతీయ రహదారిపైకెక్కి విన్యాసాలు చేస్తూ పెండ్లి ఊరేగింపు మొదలుపెట్టారు. వరుడు టాప్‌లెస్ ఆడికారులోకి ఎక్కి నిల్చోగా, మిగతా వారిలో కొందరు కార్లపైకెక్కి సెల్ఫీలు తీసుకుంటే, మరికొందరు కారు డోర్లపై కూర్చుని విన్యాసాలు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్సులు చేశారు ఇంకొందరు. ముజఫర్‌నగర్-హరిద్వార్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదకర ఊరేగింపును ఆ దారినపోయే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. స్థానిక పోలీసులకు చేరింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही।
➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022
రోడ్డుపై ప్రమాదకరంగా ఈ ఊరేగింపు ఏంటంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేలా ఊరేగింపు జరగడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం ఇలా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి తోయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో తిరిగి తిరిగి పోలీసుల దృష్టిలో పడడంతో చర్యలు ప్రారంభించారు. వరుడి కారుతో సహా ఊరేగింపులో పాల్గొన్న 8 కార్లను సీజ్ చేశారు. కార్ల యజమానులకు ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ముజఫర్‌నగర్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వీడియో చూసిన ప్రతిఒక్కరూ తిక్క కుదిరిందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి