పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. స్టోరీ తెలిస్తే ఫిదా అవాల్సిందే

జీవితంలో విజయం కోసం వారి పోరాటానికి అది నాంది. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజిత ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచాడు అనీష్‌. ఆమె కామర్స్‌లో పీహెచ్‌డీ చేసి కిలిమనూరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేసింది. అయితే, రజితలో

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి..  భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. స్టోరీ తెలిస్తే ఫిదా అవాల్సిందే
Remarries
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2022 | 9:09 AM

వెంజరమూడులో ఓ జంట వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. పెళ్లయిన 8ఏళ్ల తర్వాత వరుడు ఈ ప్రత్యేక బహుమతితో వధువుని ఆశ్చర్యపరిచాడు. అనీష్‌, డాక్టర్‌ వైఎస్‌ రజిత వారి 7ఏడేళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించారు. ఈ జంట 29 డిసెంబర్‌ 2014న పెళ్లి చేసుకున్నారు. రజిత్ ఎంకామ్‌ చదువుతుండగా, అనీష్‌ ఒక ప్రవేట్‌ సంస్థలో పనిచేస్తుండేవాడు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకని అనిష్‌ బంధువులు రజిత తల్లిదండ్రులను కలిశారు. అయితే, ఈ పెళ్లిని రజిత కుటుంబీకులు వ్యతిరేకించారు. కానీ, ఓ కండిషన్‌ పెట్టారు. ఎలాంటి పెళ్లి ఆచరాలు లేకుండా రజితను కట్టుబట్టలతో ఇంటికి తీసుకెళ్లాలని అనీష్‌ బంధువులను కోరారు. దాంతో ఆ మరుసటి రోజే అనీష్ తల్లి, సోదరి కలిసి వచ్చి రజితను తమ ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం కీజాయికోణంలోని ఓ ఆడిటోరియంలో వరుడి స్నేహితులు, బంధువుల సమక్షంలో అనీష్‌, రజిత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.

జీవితంలో విజయం కోసం వారి పోరాటానికి అది నాంది. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజిత ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచాడు అనీష్‌. ఆమె కామర్స్‌లో పీహెచ్‌డీ చేసి కిలిమనూరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేసింది. అయితే, రజితలో ఏదో తెలియని అసంతృప్తి కనిపించేది. ఎప్పుడు ఏ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నా భార్య మొహం దుఃఖంతో వాలిపోవడం గమనించాడు అనీష్. ఆమె కలర్‌ఫుల్‌ ఈవెంట్స్‌ని, అలాంటి సన్నివేశాల ఆనందాన్ని చూస్తూ కలత చెందుతుందని అతనికి అర్థమైంది. వారు పారిపోకపోయినా, అనీష్‌ బంధువుల ఆశీర్వాదంతోనే వివాహం చేసుకున్నప్పటికీ, అందమైన వధువుగా అలంకరించుకోవాలనేది రజిత కల. తనకు ఇంత నిరాడంబరమైన పెళ్లి రోజు రావడం తన విధి అని కూడా ఆమె నమ్ముతుండేది.

వారి పెళ్లి రోజున అన్నీ ఫోటోలు, వీడియోలలో రజిత విచారంగా, దిగులుగా కనిపించింది. అయితే, ఆ జ్ఞాపకాలు ప్రత్యేకంగా ఉండటంతో ఈ జంట ఆల్బమ్‌ను అలాగే ఉంచారు. ఆ ఫోటోలను చూసినప్పుడల్లా తమకెంతో బాధగా ఉంటుందని అంటున్నారు. అనీష్‌ తన భార్య కోసం ఎదురుచూస్తున్న అందమైన, మరపురాని పెళ్లి రోజును ఎలా బహుమతిగా ఇవ్వాలో అర్థం కాలేదు. రచయిత, సామాజిక కార్యకర్త అయిన అనీష్ తన గందరగోళాన్ని తోటి సామాజిక కార్యకర్త మీరా అజిత్‌కుమార్‌తో పంచుకున్నారు. దాంతో ఆమె ఓ గ్రేట్‌ ఐడియా ఇచ్చింది. వెంటనే వారికి వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అనీష్‌ ,రజిత వధూవరులుగా ముస్తాభయ్యారు. కానీ, ఈ సారి మాత్రం రజిత ముఖంలో చిరునవ్వు మెరిసింది. తిరువనంతౌరంలోని అట్టుకల్‌ దేవాలయం, శంకుముఖం బీచ్‌తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్‌ది డేట్‌, ప్రీ అండ్‌ పోస్ట్‌ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌ జరిగింది. థీసెస్‌ అందంగా తీసిన ఫోటోలు డిజిటల్‌ ఆల్బమ్‌గా మారాయి. ఆ జంట ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఆల్బమ్‌ తయారైంది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి
Remarries F

అనీష్ తన భార్య కోసం ఒక అందమైన కవిత కూడా రాశాడు. అందులో అతను ఆమెను తన జీవితపు ప్రేమ అని పిలుస్తాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అనీష్‌ 15ఏళ్లలోపు శారీరకంగా వికాలాంగులైన పిల్లలకు సహాయం, మద్దతును అందించే స్నేహయాత్ర అనే స్వచ్ఛంద సంస్థను వలియాకొట్టక్కల్‌లో నిర్వహిస్తున్నాడు. అతను స్నేహయాత్ర అనే మారుపేరుతో కూడా వ్రాస్తాడు. ఈ బృందం వరదల సమయంలో చురుగ్గా ఉండి, అవసరమైన వారికి అవసరమైన వస్తువులను పంపిణీ చేసింది. అంతేకాకుండా, రక్తదాన శిభిరాలను నిర్వహించే వేరే సంస్థలను కూడా అనీష్‌ సమన్వయం చేస్తాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలో 50 శాతానికి పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు ..
ప్రపంచంలో 50 శాతానికి పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు ..
వాయిదాల్లో లంచం.. ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌కే దొరికిపోయాడు!
వాయిదాల్లో లంచం.. ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌కే దొరికిపోయాడు!
కుట్టు మిషన్ నేర్చుకుంటోన్న టీమిండియా క్రికెటర్ భార్య.. ఫొటోస్
కుట్టు మిషన్ నేర్చుకుంటోన్న టీమిండియా క్రికెటర్ భార్య.. ఫొటోస్
ఈ విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించబోతున్నాయి
ఈ విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించబోతున్నాయి
ఇకపై రైలులో లోయర్ బెర్త్ వారికే.. ఈ చిన్న టిప్ పాటించాల్సిందే..!
ఇకపై రైలులో లోయర్ బెర్త్ వారికే.. ఈ చిన్న టిప్ పాటించాల్సిందే..!
రెండు రోల్స్ రాయిస్ కార్ల కంటే ఖరీదైన గేదె సంతలో ప్రత్యేక ఆకర్షణ
రెండు రోల్స్ రాయిస్ కార్ల కంటే ఖరీదైన గేదె సంతలో ప్రత్యేక ఆకర్షణ
ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్
ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్
దళపతి విజయ్ చివరి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా..
దళపతి విజయ్ చివరి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా..
'నా మెదడును మెషీన్‌తో కంట్రోల్ చేస్తున్నారు..' సుప్రీంలో పిటిషన్
'నా మెదడును మెషీన్‌తో కంట్రోల్ చేస్తున్నారు..' సుప్రీంలో పిటిషన్
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ గల్లీ బాయ్ భాస్కర్
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ గల్లీ బాయ్ భాస్కర్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!