AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithvi-2 Missile : పృథ్వీ-2 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. దీని ప్రత్యేకతలు, శక్తి సామర్థ్యాలు ఏంటంటే..

షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్‌ను పరీక్షించగా..

Prithvi-2 Missile : పృథ్వీ-2 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. దీని ప్రత్యేకతలు, శక్తి సామర్థ్యాలు ఏంటంటే..
Prithvi 2 Missile
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2022 | 6:55 AM

Share

Prithvi-2 Missile:  షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్‌ను పరీక్షించగా.. విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ దేశీయంగా అభివృద్ధి చేసింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టిందని తెలిపింది. పరీక్ష సమయంలో క్షిపణి సూచించిన అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను కలిగి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో కూడా విజ‌య‌వంతంగా పరీక్షించిన విష‌యం తెలిసిందే. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్‌.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన పృథ్వీ-2.. 500/100 కిలోల వార్ హెడ్‌లను మోసుకెళ్లగలదు. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. DRDO అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్