UPSC Recruitment 2022: యూపీఎస్సీలో ఈ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? నేటితో ముగుస్తున్న..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని.. వైస్ ప్రిన్సిపాల్ (Vice Principal Posts) తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు..
UPSC Vice-Principal Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని.. వైస్ ప్రిన్సిపాల్ (Vice Principal Posts) తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా కమిషన్ సూచిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం క్లాప్తంగా మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 161
పోస్టుల వివరాలు:
- డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 3
- అసిస్టెంట్ కీపర్ పోస్టులు: 1
- కెమిస్ట్రీలో మాస్టర్ పోస్టులు: 1
- మినరల్ ఆఫీసర్ పోస్టులు: 20
- అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2
- సీనియర్ లెక్చరర్ పోస్టులు: 2
- వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు: 131
- సీనియర్ లెక్చరర్ పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.25
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 16, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.