TS MHSRB Jobs 2022: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలివే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..
MHSRB Telangana Civil Assistant Surgeon Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటికీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Telangana MHSRB) ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1326
పోస్టుల వివరాలు:
- ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 751
- వైద్య విద్య డైరెక్టరేట్‌లో ట్యూటర్ పోస్టులు: 357
- తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు: 211
- ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 7
పే స్కేల్:
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050
- ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు జీతంగా చెల్లిస్తారు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ. 200
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 15, 2022 ఉదయం 10 గంటల 30 నిముషాల నుంచి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2022 సాయంత్రం 5 గంటల వరకు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.