Fish: గత కొద్దిరోజులుగా బయటపడుతున్న సముద్రంలో వింత చేపలు.. భయపడుతున్న జనం..!
సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే చేపలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సముద్రంలో రకరకాల జీవరాశులు ఉంటాయి. అందులో ఒక్కోసారి వింత వింత చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా సముద్రం అడుగున జీవించే చేపలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్లు భయపడుతున్నారు. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు అయిన ఓ జాలరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల్లో ఉన్న చేపలు సముద్రం లోతుల్లో జీవిస్తాయట. వాటిని పట్టుకొచ్చి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో ఒకటి.. పారదర్శకంగా ఉన్న చేపను కలిపి కుట్టేశాడతను. దీని ఫొటోను షేర్ చేస్తూ ఫ్రాంకెన్‌స్టెయిన్స్ ఫిష్ అంటూ పోస్టు చేశాడు. ఇక రెండో ఫొటోలో అయితే.. చేప నోటిలో నుంచి దాని పొట్టలో ఉండే పేగులు బయటకు వచ్చి కనబడుతున్నాయి. వాటిన చూసిన యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక రెండో చేపను చూస్తుంటే అది బారోట్రామాకు గురైనట్లు ఉందని, డైవర్లు దాన్ని ‘ది బెండ్స్’ అంటారని చెబుతున్నారు. సముద్రంలో అడుగున ఉండే చేపలను పైకి తీసుకొచ్చే సమయంలో ఒత్తిడి మారడం వల్ల చేపల పొట్టలోని భాగాలన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయట. అయితే చేప మాత్రం బతికే ఉంటుంది’’ అని వివరించారు. ఈ చేపలు సముద్రంలో 650 నుంచి 8,530 అడుగుల లోతున జీవిస్తాయట. అలాగే ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునేలా వీటి శరీరనిర్మాణం ఉంటుందట. ఏది ఏమైనా ఈ ఫొటోలు చూసి నెటిజన్లు భయపడిపోయినట్లు వారి కామెంట్లను బట్టి అర్ధమవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!