AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సో..క్యూట్.. వర్షాన్ని తెగ ఎంజాయ్ చేస్తోన్న బుడ్డొడు.. జోరు వానలో ఏం చేస్తున్నాడో చూస్తే ఫిదా అయిపోతారు..

వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదుచెప్పండి. మనలో చాలామంది వర్షం పడిందంటే చాలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. అలాగే వర్షాలు గట్టిగా పడినప్పుడు రోడ్లు జలమైపోతాయి. కొంతమంది

సో..క్యూట్.. వర్షాన్ని తెగ ఎంజాయ్ చేస్తోన్న బుడ్డొడు.. జోరు వానలో ఏం చేస్తున్నాడో చూస్తే ఫిదా అయిపోతారు..
Toddler
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2022 | 11:15 AM

Share

దేశంలోని అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో అల్లాడిపోతున్నాయి. ఏసీలు, కూలర్లు, ఐస్‌క్రీంలు కూడా కాలిపోతున్న ఉష్ణోగ్రత నుండి ఉపశమనం కలిగించలేకపోతుంది. అందరూ చల్లటి వాన కబురు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రుతుపవనాలు వేగంగా, చాలా వేగంగా కమ్ముకొచ్చాయి. ఈ యేడు రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ, మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే రుతుపవనాలు తడిపేస్తున్నాయి. తొలికరి చినుకుల్లో హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న ఓ బుడ్డొడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదుచెప్పండి. మనలో చాలామంది వర్షం పడిందంటే చాలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. అలాగే వర్షాలు గట్టిగా పడినప్పుడు రోడ్లు జలమైపోతాయి. కొంతమంది ఆ వర్షపు నీటిలో ఆటలాడుతుంటారు. ఆ కోవకు చెందిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక్కడ ఓ బుడతడు కూడా అలాగే వర్షపు నీటిలో ఆటలు ఆడుతున్నాడు. ఈ వీడియోని మీరూ ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. వర్షాన్ని ఆస్వాదిస్తున్న చిన్న పిల్లాడి వీడియో ఇది. వైరల్ వీడియో ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ ఖాతా బ్యూటెంగెబిడెన్‌లో పోస్ట్ చేయబడింది. ఇది 23 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో పసుపు రంగు రెయిన్ కోట్ ధరించిన పసిపిల్లవాడు వర్షాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. అది కూడా వర్షంలో తడుస్తూ..రోడ్డు వర్షపు నీటిలో పడుకుని మరీ తడుస్తున్నాడు. ఈ అమూల్యమైన వీడియోను నెదర్లాండ్స్‌లో చిత్రీకరించారు.

నెటిజన్లు ఈ క్యూట్ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ అనేక భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే, మీ అనుభూతిని కామెంట్‌ రూపంలో చెప్పండి..

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..