AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: యాజమానిని దీనంగా వేడుకుంటున్న కుక్క.. కారణం తెలిస్తే షాకవుతారు.. వీడియో చూడాల్సిందే

మనుషుల కంటే కుక్కలు ఎక్కువ మానవత్వాన్ని ప్రదర్శిస్తే, అప్పుడు మనుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ కోవకు చెందినదే ఈ వీడియో. ఓ కుక్క క్యూట్ మెసేజ్ ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Viral video: యాజమానిని దీనంగా వేడుకుంటున్న కుక్క.. కారణం తెలిస్తే షాకవుతారు.. వీడియో చూడాల్సిందే
Dog Viral Video
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2022 | 10:30 AM

Share

కోపం, బాధ‌, న‌వ్వు, మాట‌లు అర్థం చేసుకోవ‌డం ఇలా అన్నింటిలోనూ మ‌నుషుల‌ను ఫాలో అయిపోతున్నాయి.అయితే ఇలా పెంపుడు కుక్కలుకు స‌బంధించి ఏదో ఒక వీడియో అయితే నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంది. చాలా వ‌ర‌కు ఇవి ఫ‌న్నీగానే ఉంటున్నాయి. కుక్కలు య‌జ‌మానులు ఇంటికి లేటుగా వ‌స్తే ఏడుస్తూ తిన‌కుండా కూర్చోవ‌డం కూడా మ‌నం అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. ఇక త‌మ ఓన‌ర్లకు ఏదైనా ఆప‌ద వ‌చ్చింద‌టే చాలు చాలా కుక్కలు త‌మ ప్రాణాల‌ను అడ్డుగా వేసి మ‌రీ కాపాడుతున్నాయి. కానీ ఇక్కడ ఓ కుక్క తన ఓనర్‌నే ఎదిరించి మరీ చేపలను కాపాడింది. కానీ, మనుషుల కంటే కుక్కలు ఎక్కువ మానవత్వాన్ని ప్రదర్శిస్తే, అప్పుడు మనుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ కోవకు చెందినదే ఈ వీడియో. సోషల్ మీడియాలో ఓ కుక్క క్యూట్ మెసేజ్ ఇస్తున్న వీడియో కాస్త వైరల్ అవుతోంది.

వీడియోలో ఓ మహిళను చేపలను శుభ్రం చేసేందుకు సిద్ధమైంది. తన ఎదురుగా ఓ చిన్నటబ్‌లో బతికున్న చేపలున్నాయి. నీటిలో నుంచి ఆమె ఒక్కో చేపను బయటకు తీసి శుభ్రం చేసి, ముక్కలు చేసేపని పెట్టుకుంది. కానీ, పక్కనే కూర్చున్న కుక్క ఆమెపైకి గట్టి గట్టిగా అరుస్తూ చేపలను చంపొద్దు అన్నట్టుగా వేడుకుంటుంది. కుక్క తన రెండు కాళ్లపై నిల్చుకుని అరుస్తూ…ప్లీజ్‌ చేపను కొయొద్దు అన్నటుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తుంది. చేతులు జోడించి వేడుకునే భంగిమలో ఆ కుక్క నానా హంగామా చేసింది. దాంతో ఆ మహిళ చేపల టబ్బు తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్యూట్‌ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు కుక్కను తెగ మెచ్చుకుంటున్నారు. కుక్క కొన్ని సార్లు కాటువేస్తుంది. కానీ, విశ్వాసం, జాలి,దయ చూపించటంలో అవి మనుషుల్ని మించిపోయాయంటూ మరో నెటిజన్‌ ట్విట్‌ చేశారు. జనం హృదయాలను హత్తుకునే ఈ వీడియోపై జనాలు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో పాటు జంతువులలో మానవత్వం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంకొందరేమో ఆ చేపల్ని తనకు పెట్టమని అడుగుతుందంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. ఏదైతేనేం, సందేశం స్పష్టంగా ఉంది.

View this post on Instagram

A post shared by Nikki (@nikitaaa_08_)

నెటిజన్ల భిన్నమైన కామెంట్స్‌తో వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో నికితా ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. దీన్ని ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ
8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ
రాఖీ రోజు అదిరిపోయే గుడ్‌న్యూస్..4గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం
రాఖీ రోజు అదిరిపోయే గుడ్‌న్యూస్..4గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం
ఓటీటీలోకి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి సినిమా..
ఓటీటీలోకి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి సినిమా..
వేల మందిని గొర్రెలను చేసి ఒక్క రాత్రిలో 8.5 కోట్లు సంపాదించాడు!
వేల మందిని గొర్రెలను చేసి ఒక్క రాత్రిలో 8.5 కోట్లు సంపాదించాడు!
కళ్లముందే AK-47లు.. పోలీసులు మాత్రం జేబులు వెతికారేంటి?
కళ్లముందే AK-47లు.. పోలీసులు మాత్రం జేబులు వెతికారేంటి?
రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా?
రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా?
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.2.31 కోట్లు స్వాహా!
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.2.31 కోట్లు స్వాహా!
అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..
అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..
రోజుకు రూ.10 కూలీ.. నేడు రూ.681 కోట్ల బిజినెస్! సక్సెస్‌ స్టోరీ
రోజుకు రూ.10 కూలీ.. నేడు రూ.681 కోట్ల బిజినెస్! సక్సెస్‌ స్టోరీ
ఇక కన్నీళ్లే ఉండవ్.. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్..
ఇక కన్నీళ్లే ఉండవ్.. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్..