AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election 2023: ఎన్నికల సమయంలో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారంను ఏం చేస్తారో తెలుసా.

ఎన్నికల టైం వచ్చిందంటే చాలు...ఎక్కడో దాక్కున్న నోట్ల కట్టలన్నింటికీ రెక్కలొచ్చేస్తాయ్..ఎక్కడ వాలిపోవాలో అక్కడే వాలిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఎన్నికల నగారా మోగిందిగా.. ఎక్కడబడితే అక్కడ డబ్బు సంచులు దొరుకుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో, రాజస్థాన్ నుంచి రూ. 444 కోట్లకు పైగా నగదు రికవరీ చేయబడింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

Election 2023: ఎన్నికల సమయంలో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారంను ఏం చేస్తారో తెలుసా.
Crores Of Cash
Sanjay Kasula
|

Updated on: Oct 27, 2023 | 7:00 PM

Share

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్నవారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఎన్నికల తేదీల ప్రకటనతో, అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలు కూడా ముమ్మరం అవుతాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి నాయకులు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ వందల కోట్ల రూపాయల నగదు బయటపడింది. రాజస్థాన్‌లో ఎన్నికలకు ముందు ఇప్పటివరకు రూ.244 కోట్ల నగదు పట్టుబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతి ఎన్నికలలో రికవరీ అయ్యే వందల కోట్ల విలువైన ఈ నగదు ఏమవుతుంది..? ఎక్కడికి వెళ్తుంది?

పోలీసులు తనిఖీలు చేస్తారు..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం కూడా పెరుగుతుండడంతో కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. దీని కోసం పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు,  వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇది కాకుండా పోలీసులకు ఇన్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి సహాయంతో వారు ఈ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

జప్తు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది?

ఇప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతాయన్న ప్రశ్నకు వస్తే… ఎన్నికల సమయంలో పోలీసులు ఏ నగదును స్వాధీనం చేసుకున్నా.. దాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే, దీని తర్వాత నగదు రికవరీ అయిన వ్యక్తి దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, ఒక వ్యక్తి డబ్బు తనదే అని నిరూపించడంలో విజయం సాధించి, దాని పూర్తి సమాచారాన్ని సాక్ష్యంగా చూపితే, అతనికి డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. అయితే ఎవరూ డబ్బును క్లెయిమ్ చేయకపోతే అది ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడుతుంది. క్లెయిమ్ చేయడానికి, మీరు తప్పనిసరిగా ATM లావాదేవీ, బ్యాంక్ రసీదు లేదా పాస్‌బుక్ ఎంట్రీని చూపించాల్సి ఉంటుంది.

ఎన్నికల సమయంలో నగదుతో పాటు మద్యం కూడా పెద్దఎత్తున పట్టుబడుతూ, ఈ మద్యాన్ని ఒకే చోట సేకరించి కొంత సమయం తర్వాత కలిపి ధ్వంసం చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి