AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీఎంల పని అయిపోయింది.. రేవంత్ భవిష్యత్తును కూడా ఊహించలేం.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఇప్పటికే.. అధికారాన్ని చేజిక్కించుకుని జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోని 17 స్థానాల్లో రెండంకెల స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆర్థిక బలం, బలగం ఉన్న నేతలకు టికెట్లను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్టులో 4, మూడో లిస్టులో 5 పేర్లను ప్రకటించింది.

ఆ సీఎంల పని అయిపోయింది.. రేవంత్ భవిష్యత్తును కూడా ఊహించలేం.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..
Kunamneni Sambasiva Rao CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2024 | 12:22 PM

Share

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఇప్పటికే.. అధికారాన్ని చేజిక్కించుకుని జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోని 17 స్థానాల్లో రెండంకెల స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆర్థిక బలం, బలగం ఉన్న నేతలకు టికెట్లను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్టులో 4, మూడో లిస్టులో 5 పేర్లను ప్రకటించింది. అయితే, ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీచేసే అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు హాట్ టాపిక్ గా మారింది.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ పోటీ పడుతున్నారు. అంతేకాకుండా.. వీ హనుమంతరావు లాంటి కాంగ్రెస్ సినీయర్ నేతలు కూడా ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పొత్తులో భాగంగా ఓ సీటును దక్కించుకున్న సీపీఐ పార్టీ ఖమ్మం సీటుపై మనసుపడింది. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్ సభ సీటును తమకు కేటాయించాలంటూ కోరింది.. అది కుదరకపోతే.. వరంగల్ స్థానాన్ని అయినా తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తోంది..

ఈ క్రమంలోనే.. తెలంగాణలో సీపీఐకి ఎంపీ సీటు కేటాయించాలన్న.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సీటు కాంగ్రెస్ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీపీఐకి ఇవ్వాలా లేదా అనేది కాంగ్రెస్ విచక్షణ అంటూ పేర్కొన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలనేది ఆలోచిస్తామని కూనంనేని పేర్కొన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగలవంటూ సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇండియా కూటమిలోని ఇద్దరు సీఎంల పని అయిపోయిందన్నారు. జార్ఖండ్, ఢిల్లీ సీఎంలని అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా ఊహించలేం అంటూ కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్