తెలంగాణలో తగ్గుతోన్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. 94,189 నమూనాలను పరీక్షించగా 2493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది...

తెలంగాణలో తగ్గుతోన్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Follow us

|

Updated on: Jun 01, 2021 | 8:20 PM

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. 94,189 నమూనాలను పరీక్షించగా 2493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. మరో 15 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 3308కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 318, నల్గొండ 165, రంగారెడ్డి 152, మేడ్చల్ మల్కాజ్ గిరి 137, కరీంనగర్ 129, ఖమ్మం 121, కొత్తగూడెం జిల్లాల్లో 115 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

గ్రేటర్‌లో మంగళవారం 27 117 మందికి వ్యాక్సిన్…

కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో 27 117 మందికి వ్యాక్సిన్ వేయించారు. అన్నపూర్ణ ఉచిత భోజనం కార్యక్రమంలో భాగంగా నేడు 75,340 ఉచిత భోజనాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేసింది.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!