AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టిన ఓ ఇల్లాలికి ఊహించని షాక్ తగిలింది. తన అనుమతి లేకుండా భార్య తన ఫోన్‌పై నిఘా పెట్టిందని..

Viral News: భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!
Woman Spy Husband Phone
Ravi Kiran
|

Updated on: May 31, 2021 | 2:35 PM

Share

Woman Spies Husband: భర్త ఫోన్‌పై నిఘా పెట్టిన ఓ ఇల్లాలికి ఊహించని షాక్ తగిలింది. తన అనుమతి లేకుండా భార్య తన ఫోన్‌పై నిఘా పెట్టిందని.. అంతేకాకుండా తన ఫోన్‌లోని ఫోటోలను వేరేవాళ్లకు పంపించందని.. అది తనకు ఇష్టం లేదంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. ఇక ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఆ వ్యక్తి భార్యకు 5,400 దిర్హమ్‌ల నష్టపరిహారాన్ని విధించింది. ఈ వింత సంఘటన అబుదాబీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అబుదాబీకి చెందిన దంపతుల మధ్య పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. కొద్దికాలానికి భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తనకు తెలియకుండా భర్త ఏవో సీక్రెట్స్ ఫోన్‌లో దాస్తున్నాడని ఆ ఇల్లాలు భావించింది. ఈ క్రమంలోనే ఆమె తన భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది. అంతేకాకుండా అందులో ఉన్న ఫోటోలను తన భర్తకు తెలియకుండా వేరేవాళ్లకు పంపించింది. ఇక ఈ విషయం భర్తకు తెలియడంతో.. అతడు భార్యపై ఆగ్రహించి కోర్టును ఆశ్రయించాడు.

తన క్లయింట్ ప్రైవసీకి భంగం కలిగించేలా అతడి భార్య చేసిందని భర్త తరపు లాయర్ వాదించగా.. ”తన క్లయింట్ తప్పు ఏం లేదని.. భర్త చేతిలో మానసిక క్షోభను అనుభవించిందని భార్య తరపు లాయర్ తెలిపాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. భర్త వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినందుకు గానూ భార్యకు 5,400 దిర్హమ్‌లు(రూ. లక్ష) నష్ట పరిహారం చెల్లించాలంటూ సరికొత్తగా తీర్పునిచ్చింది.