V Hanumantha Rao: ఆ విషయాలపై ఇప్పుడేం మాట్లాడను.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత..
V Hanumantha Rao: అనారోగ్యంతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించిన ప్రతీ ఒక్కరికి..
V Hanumantha Rao: అనారోగ్యంతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించిన ప్రతీ ఒక్కరికి కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యానికి గురై కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన వీహెచ్.. శనివారం నాడు మీడియా ముందుకు వచ్చారు. తన ఆరోగ్యం కుదుటపడటంతో.. మీడియా ముందకు వచ్చి మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను కలవడానికి చాలా మంది వచ్చారని, వారందరికీ వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కళ్యాణ్.. నా ఆరోగ్య విషయంలో లెటర్ రాశారు’ అని చెప్పుకొచ్చిన వీహెచ్.. పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బడుగు బలహీన వర్గాల వాళ్లకి తన సేవలు అవసరం అని తమ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే త్వరగా కోలుకోగలిగానని తెలిపారు. సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బులు సంపాదించడానికి రాలేదని వీహెచ్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ తనతో మాట్లాడటం వల్ల తనకు మరింత ధైర్యం పెరిగిందన్నారు. తన మిగతా జీవితం అంతా బడుగు బలహీన వర్గాల సేవకే అంకితం చేస్తానని వీహెచ్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడ ఆపద ఉంటే.. తాను అక్కడ ఉంటానని వీహెచ్ పేర్కొన్నారు. తమ నాయకురాలు సోనియా గాంధీని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటీ గురించి మాట్లాడుతానన్న వీహెచ్.. అప్పటి వరకు నోరు మెదపబోనని తేల్చి చెప్పారు.
Also read: