AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన..

YS Vivekananda Reddy: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్.. దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన..

YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన..
Ys Viveka
Shiva Prajapati
|

Updated on: Jul 24, 2021 | 10:02 AM

Share

YS Vivekananda Reddy: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్.. దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీల్ కుమార్ యాదవ్ సహా నలుగురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లా మోతునూతలపల్లి కి చెందిన వై సునీల్ యాదవ్, అతని కుటుంబానికి చెందని మరో ముగ్గురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రతివాదిగా సీబీఐ డైరెక్టర్‌ను పేర్కొన్నారు. సీబీఐ విచారణ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ ఏడాది సీబీఐ తనకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లినట్లు పిటిషనర్ సునీల్ పేర్కొన్నాడు. విచారణ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించాడు. అంతేకాదు.. తన అనుమతి లేకుండానే బలవంతంగా లై డిటక్టర్ వినియోగించారని పిటిషనర్ ఆరోపించారు. ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. వివేకా హత్య కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా, శుక్రవారం నాడు వివేకా ఇంట్లో వాచ్‌మన్ గా పని చేస్తే రంగయ్యను జడ్జ్ ముందు ప్రవేశపెట్టారు. రంగయ్య వాంగ్మూలంలో చెప్పిన అనుమానితుల్లో సునీల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉంది. అయితే, ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.

Also read:

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

Guru Purnima : తెలుగురాష్ట్రాల్లో భక్తిప్రపత్తులతో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ